ఎండకాలం వచ్చిందంటే చాలు చాలా మంది నిద్ర పట్టక అనేక ఇబ్బందులకు గురవుతారు.
ప్రతీకాత్మక చిత్రం
ఎండాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది నిద్ర పట్టక ఇబ్బందులకు గురవుతారు. ఎండాకాలం ఉదయం పది, పదకొండు సమయం వచ్చే సరికే సూర్యుడు ఎర్రెక్కిపోతాడు. ఆ వేడికి మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేక ఇంట్లోనే ఉంటుంటాం. ఇంట్లో ఉంటే తప్పనిసరిగా మధ్యాహ్నం పడుకోవడం అలవాటు అవుతుంది చాలా మందికి. కానీ ఆ సూర్యునికి వేడికి ఇంట్లో ఫ్యాన్స్, కూలర్స్, ఏసీ ఇలా రకారకాలవి పెట్టుకొని పడుకున్నా నిద్ర పట్టదు. సాయంత్రం కూడా బయట నుంచి వచ్చే గాలి కూడా వేడిగా ఉంటుంది. దీనికి తోడుగా ఎండాకాలంలో కరెంట్ కోతలు కూడా ఎక్కువే. పని చేసి అలసిపోయి నిద్రపోవడానికి ఎంత ప్రయత్నం చేసినా నిద్ర పట్టదు. నిద్రలేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాంటివారు చిన్న చిట్కాతో నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు.
ఉష్ణోగ్రత, ఉక్కపోత వల్ల సరిగా నిద్ర పట్టక సతమతం అవుతున్నపుడు జీలకర్ర వేసి బాగా మరిగించిన నీళ్లను తాగడాన్ని అలవాటు చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. చక్కగా నిద్ర పడుతుంది. పడుకునే ముందు స్నానం చేయడం మంచిది. పడుకునే ముందు నీళ్లు తాగడం వల్ల కూడా మంచి నిద్ర పడుతుంది. ఇక.. నిద్ర పట్టక ఇబ్బంది పడేవారు నిద్ర వేళకు కొన్ని గంటల ముందు కాఫీ, టీ, చాక్లెట్లను తీసుకోవడం మానేయండి. పడుకునే ముందు వీటిని తీసుకున్నా, భారీగా భోజనం చేసినా నిద్ర కష్టతరం అవుతుంది. స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్ టాప్ నుంచి వెలువడే బ్లూ లైట్ నిద్రను నియంత్రించే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తుంది. పడుకునే ముందు స్మార్ట్ ఫోన్లు వినియోగం కూడా నిద్రలేమి సమస్యను సృష్టిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు పడుకునే సమయంలో స్మార్ట్ ఫోన్‌కు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.