గుండె జబ్బులకు ప్రధానమైన కారణంగా ఒత్తిడిగా నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగ, వ్యాపారపరమైన ఒత్తిళ్లతో చాలా మంది టెన్షన్ పడుతుంటారు. అయితే, ఈ టెన్షన్ గుండె పోటుకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానసిక ఒత్తిడి పెరిగి గుండె జబ్బులు బారినపడే ప్రమాదం ఉందంటున్నారు. దీర్ఘకాలిక ఒత్తిడి, ఆందోళన, నిరాశ గుండె సమస్యలను పెంచుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేసిన పరిశోధనలో వెల్లడైంది. ఆందోళన, డిప్రెషన్ వంటివి కార్డియో వాస్కులర్ ప్రమాదాన్ని పెంచుతాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ హెచ్చరించింది.
టెన్షన్
గత కొన్నాళ్లుగా గుండె జబ్బులు బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అప్పటి వరకు ఆరోగ్యంగా కనిపించిన ఎంతో మంది రాత్రికి రాత్రి గుండె పోటుతో మృత్యువాత చెందుతున్నారు. ఈ తరహా సమస్యలు బారినపడుతున్న వారిలో యువత కూడా అధికంగా ఉంటున్నారు. గుండె జబ్బులకు ప్రధానమైన కారణంగా ఒత్తిడిగా నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగ, వ్యాపారపరమైన ఒత్తిళ్లతో చాలా మంది టెన్షన్ పడుతుంటారు. అయితే, ఈ టెన్షన్ గుండె పోటుకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానసిక ఒత్తిడి పెరిగి గుండె జబ్బులు బారినపడే ప్రమాదం ఉందంటున్నారు. దీర్ఘకాలిక ఒత్తిడి, ఆందోళన, నిరాశ గుండె సమస్యలను పెంచుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేసిన పరిశోధనలో వెల్లడైంది. ఆందోళన, డిప్రెషన్ వంటివి కార్డియో వాస్కులర్ ప్రమాదాన్ని పెంచుతాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక ఒత్తిడి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని, కాబట్టి అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇదే విషయాన్ని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పరిశోధన కూడా వెల్లడించింది.
తీవ్రమైన ఒత్తిడి గుండెను వివిధ రకాలుగా ప్రభావితం చేస్తుంది. ఒత్తిడి శరీరంలోని హార్మోన్లలో మార్పులను తీసుకువస్తుంది. ఒత్తిడి వల్ల కార్టిసాల్, ఆడ్రినలిన్, నోరాడ్రినలిన్ ఎక్కువగా విడుదల చేస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి హాని చేస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడి రక్తపోటును కూడా పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానసిక ఒత్తిడి వల్ల వాపు పెరిగి రక్తనాళాలు దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు చేసుకునే స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అలవాట్లు, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటివి కూడా మరింత ఇబ్బందులకు గురి చేస్తాయంటున్నారు. ఒత్తిడి పరిధికి మించితే కార్డియాక్ అరెస్ట్‌కు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, కొన్ని జగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఒత్తిడిని కంట్రోల్ చేసే యోగా, మెడిటేషన్ వంటివి చేయాలి. ఒత్తిడికి కారణమవుతున్న అంశాలను గుర్తించి వాటి నుంచి దూరం జరిగే ప్రయత్నం చేయాలి. వృత్తిపరమైన ఒత్తిళ్లు ఉంటే వాటిని తేలికగా తీసుకునే ప్రయత్నం చేయాలి. నిరంతరం చేసే వ్యాయమం ఒత్తిడి నుంచి రిలీఫ్‌ను ఇస్తుంది. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. టైమ్ మేనేజ్‌మెంట్ ఒత్తిడి నుంచి దూరంగా ఉండేలా చేస్తుంది.