యువత గంటల తరబడి చెమటోడుస్తున్నారు. జిమ్ లో ఎక్కువ సమయం గడిపే వారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతోందంటూ అధ్యయనాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో అప్రమత్తత అవసరమని నిపుణులు చూపిస్తున్నారు. తాజాగా యుకేలో నిర్వహించిన ఈ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూకే లోని ప్రతి ఏడు జంట్లలో ఒకరిని వంధ్యత్వం ప్రభావితం చేస్తోందని ఆ అధ్యయనం వెల్లడించింది. యూకేలో జరిపిన ఈ అధ్యయనం ప్రకారం సంతాన ఉత్పత్తి అవసరమైన పురుషుల సంఖ్య భారీగా పెరిగినట్లు గుర్తించారు.
యువతలో తక్కువగా స్పెర్మ్ కౌంట్
కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత యువత ఎక్కువగా వ్యాయామంపై దృష్టి సారిస్తున్నారు. ఫిట్ గా ఉండేందుకు యువత ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎక్కువ మంది యువత గంటల తరబడి చెమటోడుస్తున్నారు. జిమ్ లో ఎక్కువ సమయం గడిపే వారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతోందంటూ అధ్యయనాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో అప్రమత్తత అవసరమని నిపుణులు చూపిస్తున్నారు. తాజాగా యుకేలో నిర్వహించిన ఈ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూకే లోని ప్రతి ఏడు జంట్లలో ఒకరిని వంధ్యత్వం ప్రభావితం చేస్తోందని ఆ అధ్యయనం వెల్లడించింది. యూకేలో జరిపిన ఈ అధ్యయనం ప్రకారం సంతాన ఉత్పత్తి అవసరమైన పురుషుల సంఖ్య భారీగా పెరిగినట్లు గుర్తించారు. మహిళల్లో అయితే లేట్ గా ఫ్యామిలీ స్టార్ట్ చేయడం, స్టీమ్ బాత్స్, ల్యాప్టాప్ ఎక్కువగా వినియోగించడం అనేది సహజ కారణాలుగా ఉన్నాయి. అదే మగవారిలో అయితే జిమ్ కు ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చే వారిలో ఈ సమస్య అధికంగా ఉన్నట్లు గుర్తించారు. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం, స్పెర్మ్ కౌంట్ ఎక్కువగా ఉన్న యాక్టివ్ గా లేకపోవడం వంటి ఇబ్బందులను గుర్తించారు. ఈ సమస్య ఫిట్నెస్ కోచ్ లు, ఫిట్నెస్ కు ప్రాధాన్యత ఇచ్చేవారిలో అధికంగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. జిమ్ లో వర్క్ చేసేవారు లెగ్గింగ్స్, షార్ట్స్ వేసుకుంటారు. జిమ్ లో వర్క్ చేసేవారు సుమారు 12 నుంచి 16 గంటలు వీటితోనే ఉంటారు. వారానికి ఆరు రోజులు అలాంటి దుస్తులే ధరిస్తారు. నిరంతరం టైట్ గా ఉండే వస్త్రాలు ధరించడం వల్ల ఆ ప్రాంతంలో వేడి ఎక్కువ అవుతుంది. ఇది ఫెర్టిలిటీ సమస్యకు దారితీస్తున్నట్లు ఈ పరిశోధన వెల్లడిపోతుంది.
మగవారి శరీరంలో సాధారణంగానే షీట్ అధికంగా ఉంటుంది. రోజులో ఎక్కువ సమయం వర్క్ అవుట్ చేయడం వల్ల మరింత హిట్ జనరేట్ అవుతుంది. దీంతో వారు యాక్టివ్ గా ఉంటారు. కానీ, ఆ వేడికి స్పెర్మ్ కణాలు కిల్ అయిపోతున్నాయి. ఇదే విషయాన్ని ఈ అధ్యయనం వెల్లడించింది. జిమ్ కు వెళ్లడం తగ్గించి వదులుగా ఉండే దుస్తులు వేసుకునే వారిలో స్పెర్మ్ సంఖ్య పెరిగినట్లు గుర్తించారు. స్పెర్మ్ నాణ్యత కూడా పెరిగిందని చెబుతున్నారు. ఈ అధ్యయనం ప్రకారం అధిక వ్యాయామం సంతాన ఉత్పత్తికి హానికరంగా మారుతున్నట్లు వెల్లడించింది. హైపోథాలమస్ పిట్యూటరీ గో యాక్సిస్ వనితీరు, ఆక్సీకరణ ఒత్తిడిలో పెరుగుదల, మంట వంటివి మగవారిలో ఫెర్టిలిటీకి కారణమవుతున్నాయి. వీటివల్ల టెస్టోస్టిరాన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇది వీర్యం నాణ్యత తగ్గుదలకు కారణం అవుతుంది. క్రమంగా అది వంధ్యత్వానికి దారితీస్తోంది. ఇప్పుడు టెస్టోస్టిరాన్ సమస్యలు ఎదుర్కొంటున్న వారు టెస్టోస్టిరాన్ థెరఫీలు తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తగినంత నిద్ర లేకపోవడం, జింక్, మెగ్నీషియం ఉన్న సప్లిమెంట్స్ తీసుకోవడం, శుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో టెస్టోస్టిరాన్ స్థాయులు పెరుగుతాయి. జిమ్ కోసం ఎక్కువ కష్టపడటం కాకుండా పరిమితిగా చేయాలని సూచిస్తూన్నారు. ఈలోగా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే ఈ మార్పులు మంచి ఫలితాలు ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా కొత్త స్పెర్మ్ క్రియేట్ అవ్వడానికి దాదాపు మూడు నెలలు సమయం పడుతుంది.