శరీరానికి అవసరమైన కొన్ని రకాల విటమిన్లు లోపిస్తే శరీరం పనితీరుపై ప్రభావాన్ని చూపిస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రపంచంలో సుమారు 200 మిలియన్ల మంది ప్రజలు అవసరమైన విటమిన్లు, కనిజాల లోపాలతో బాధపడుతున్నారు. విటమిన్ లో శరీరానికి చాలా ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు. ఇవి కణాల పనితీరుకు, వాటి పెరుగుదలకు చాలా కీలకంగా ఉంటాయి. శక్తి ఉత్పత్తి, రోగ నిరోధక పనితీరు, రక్తం గడ్డ కట్టడం, ఎముకలు, కణజాలాల నిర్వహణలో విటమిన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
విటమిన్ల పోషకాహారం
శరీరానికి అవసరమైన పోషకాలను అందించాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. విటమిన్లు, మినరల్స్, ఇతర పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అయితే శరీరానికి అవసరమైన కొన్ని విటమిన్లు లోపిస్తే మాత్రం అనేక వ్యాధులు ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే పోషకాహారం తీసుకోవడం చాలా అవసరమని సూచిస్తున్నారు.
శరీరానికి అవసరమైన కొన్ని రకాల విటమిన్లు లోపిస్తే శరీరం పనితీరుపై ప్రభావాన్ని చూపిస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రపంచంలో సుమారు 200 మిలియన్ల మంది ప్రజలు అవసరమైన విటమిన్లు, కనిజాల లోపాలతో బాధపడుతున్నారు. విటమిన్ లో శరీరానికి చాలా ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు. ఇవి కణాల పనితీరుకు, వాటి పెరుగుదలకు చాలా కీలకంగా ఉంటాయి. శక్తి ఉత్పత్తి, రోగ నిరోధక పనితీరు, రక్తం గడ్డ కట్టడం, ఎముకలు, కణజాలాల నిర్వహణలో విటమిన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. శరీరం, ఆహారం, ఇతర ఓనరుల నుంచి గెటమనులను పొందుతుంది. శరీరంలో ఈ విటమిల లోపం ఉంటే మాత్రం రకరకాల సమస్యలు పుట్టుకొస్తాయి. కాబట్టి శరీరంలో విటమిన్ల లోపం ఉండకుండా చూసుకోవాలి.
ప్రధానంగా విటమిన్ బి మెదడుకు ముఖ్యమైనది. ఈ విటమిన్ సహాయంతో మన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. విటమిన్ బి12, ఇతర బి విటమిన్లు శరీరానికి చాలా అవసరం. విటమిన్ బి 12 లోపం వల్ల అలసట, బలహీనత, జ్ఞాపకశక్తి సమస్యలు, నిద్రలేమి, చర్మ సంబంధిత సమస్యలు వేధిస్తాయి. ఈ లోపాన్ని అధిగమించేందుకు చికెన్, గుడ్లు, పుట్టగొడుగులు, అరటి పండ్లు, గింజలు వంటివి తీసుకోవాలి. విటమిన్ సి కూడా శరీరానికి చాలా ముఖ్యం. ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించడానికి పనిచేసే శక్తివంతమైన యాంటీ యాక్సిడెంట్. ఇది రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. శరీరం ఐరన్ ను తీసుకోవడంలో సహాయపడుతుంది. ఈ విటమిన్ లోపం వల్ల శరీరంలో ఐరన్ తక్కువగా ఉండి రక్తహీనత సమస్యకు దారితీస్తుంది.
ఈ విటమిన్ లోపం బలహీనమైన రోగనిరోధక శక్తి, చర్మ సమస్యలు, ఎముకల బలహీనత, నోటి వ్యాధులకు కారణమవుతుంది. ఈ విటమిన్ పెరుగుదలకు క్యాప్సికమ్, పుట్టగొడుగులు, క్యాబేజీ, పాలకూర, టమోటోలు వంటి పుల్లని పండ్లను తీసుకోవాలి. విటమిన్ డి లోపం వల్ల పెద్దలకు ఆస్టియో పోరోసిస్, పిల్లల్లో రికెట్స్ వంటి వ్యాధులు రావచ్చు. శరీరంలో కాల్షియం పెరగడానికి విటమిన్ డి కూడా అవసరం. దీని లోపం వల్ల ఆందోళన, అధిక బిపి, ఎముకలు బలహీనత, మానసిక ఒత్తిడి, మధుమేహం, గుండె జబ్బులు వంటి వేధిస్తాయి. దీనిని నివారించేందుకు ఉదయం కొంత సమయం పాటు సూర్యకాంతిలో కూర్చోవాలి. సూర్య రష్మి ద్వారా విటమిన్ డి అధిక మొత్తంలో లభిస్తుంది గుడ్డులోని పచ్చ సొన, కొవ్వు చేపల నుంచి కూడా ఈ విటమిన్ పొందవచ్చు. ఈ ఆహార పదార్థాలను ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవడం ద్వారా విటమిన్ల లోపం వల్ల వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.