ఈ మధ్యకాలంలో చాలామంది పోషకాలు, విటమిన్ల లోపంతో బాధపడుతున్నారు. వైద్యుల వద్దకు వెళితే సప్లిమెంట్స్ వాడాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోగులు, పోషకాల లోపం ఉన్నవాళ్లు డాక్టర్ చెప్పిన మోతాదులో విటమిన్లను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే విటమిన్ మాత్రమే తీసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నీటిలో కరిగే విటమిన్లు అంటే విటమిన్ బి12, విటమిన్ సి వంటివి శరీరంలో నిల్వ ఉండవు. అవి త్వరగా విసర్జించబడతాయి. వీటిని సోషించడానికి చాలా నీరు అవసరం. వీటిని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం ఉత్తమం. ఖాళీ కడుపుతో తీసుకో లేకపోతే బ్రేక్ ఫాస్ట్ తరువాత ఒక గంటకు తీసుకోవచ్చు. అప్పటికి ఆహారం జీర్ణమై నీటితోపాటు విటమిన్లు కూడా సరిగా శోచించబడతాయి.
ప్రతీకాత్మక చిత్రం
ఈ మధ్యకాలంలో చాలామంది పోషకాలు, విటమిన్ల లోపంతో బాధపడుతున్నారు. వైద్యుల వద్దకు వెళితే సప్లిమెంట్స్ వాడాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోగులు, పోషకాల లోపం ఉన్నవాళ్లు డాక్టర్ చెప్పిన మోతాదులో విటమిన్లను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే విటమిన్ మాత్రమే తీసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నీటిలో కరిగే విటమిన్లు అంటే విటమిన్ బి12, విటమిన్ సి వంటివి శరీరంలో నిల్వ ఉండవు. అవి త్వరగా విసర్జించబడతాయి. వీటిని సోషించడానికి చాలా నీరు అవసరం. వీటిని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం ఉత్తమం. ఖాళీ కడుపుతో తీసుకో లేకపోతే బ్రేక్ ఫాస్ట్ తరువాత ఒక గంటకు తీసుకోవచ్చు. అప్పటికి ఆహారం జీర్ణమై నీటితోపాటు విటమిన్లు కూడా సరిగా శోచించబడతాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న ప్రధానమైన సమస్య బి12 లోపం. ఈ సమస్య అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తోంది. ముఖ్యంగా 25 నుంచి 40 ఏళ్ల లోపు వయసు ఉన్న వారిలో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. అటువంటి వారికి విటమిన్ బి12 సిఫార్సు చేస్తున్నారు. రోజువారి మోతాదు 2.4 మైక్రో గ్రాములు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహార లోపాల కారణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. ఈ సమస్యను నివారించేందుకు సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక మాత్రలో 1500 మైక్రోగ్రాములు ఉంటుంది. ఇది అధిక శక్తి కలిగిస్తుంది. నీటిలో కరగడం వల్ల శరీరంలో నాలుగు శాతం వరకు మాత్రమే శోషించబడుతుంది. అందుకే మందులు తీసుకునే సమయం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతుంటారు. ఎప్పుడూ నిండిన కడుపుతో తీసుకోకూడదు. ఇది శోషణ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. కొవ్వులో కరిగే విటమిన్లు అంటే విటమిన్ ఏ, డి, ఈ, కే వంటివి జీవ లభ్యత, శోషణను పెంచడానికి కొవ్వు కలిగిన ఆహారం తిన్న వెంటనే తీసుకోవాలి. విటమిన్ డి పొడి రూపంలో తీసుకుంటే పాలలో కొవ్వుతో శోషణ బాగా ఉంటుంది. కాబట్టి పాలతో తీసుకోవాలి. విటమిన్ డి పొడి మాత్రల కంటే చౌక అయినది. పేగు సమస్యలు ఉన్నవారికి ఇది ఉపయోగపడదు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
నీటిలో, కొవ్వులో కరిగే విటమిన్లు కలిపి తీసుకోవడంలో అనేక అనుమానాలు ఉన్నాయి. అందుకే మల్టీ విటమిన్ క్యాప్సిల్స్ తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి. వీటిని భోజనం తర్వాత కొద్దిసేపటికి నీటితో తీసుకోవడం చాలా మంచిది. అనేక అధ్యయనాలు విటమిన్ సి, బీ12 కలిపి తీసుకోవద్దని సూచిస్తున్నాయి. ఎందుకంటే విటమిన్ సి, బి12 శోషనను తగ్గిస్తుంది. కానీ అవి నీటిలో కరిగేవి కాబట్టి కడుపు కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు తీసుకోవడం మంచిది. ఆహారంలో గుడ్డు, చేపలు, పాల ఉత్పత్తులు వంటి జంతువుల నుండి లభించే ఆహార పదార్థాలు తీసుకుంటే విటమిన్ ఏ సప్లిమెంట్లు అవసరం లేదు. అధిక విటమిన్ ఏ - ఎముకలు, జీర్ణవ్యవస్థ, చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. విటమిన్ బి9 లేదా పోలిక్ యాసిడ్ ను విటమిన్ బి12తో తీసుకోవాలి. ఎక్కువ ఫోలిక్ ఆసిడ్ లేదా ఫోలేట్ తీసుకోవడం వల్ల విటమిన్ బి12 లోపానికి సంబంధించిన లక్షణాలు కనిపించవచ్చు. కొంతమంది వైద్యులు రక్తం గడ్డ కట్టడానికి సహాయపడేందుకు విటమిన్ కే సప్లిమెంటును సూచిస్తారు. అదే సమయంలో విటమిన్ ఈ తీసుకోవడం వల్ల విటమిన్ కె ప్రభావాలను తగ్గిస్తుంది.
ఈ మధ్యకాలంలో అన్ని వయసుల వారిలో విటమిన్ల లోపం కనిపిస్తోంది. కాబట్టి ఈ విషయంలో నిర్లక్ష్యం చేయరాదని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షలు చేయించుకొని వైద్యుల సూచనలు మేరకు సప్లిమెంట్స్ వాడడం అత్యంత కీలకంగా పేర్కొంటున్నారు. ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఈ సమస్యను తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది. లేకపోతే కొన్ని రకాల ఇబ్బందులు వేధిస్తాయి. ముఖ్యంగా నిద్రలేమి, కాళ్ల నొప్పులు, తీవ్రమైన అలసట వంటి సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒకవేళ ఈ సమస్యలు ఉంటే మాత్రం తప్పనిసరిగా సప్లిమెంట్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు.