మీకు హల్వా అంటే ఇష్టమా? అయితే ఈసారి శనగపిండితో హల్వా తయారు చేయండి. చేయడం సులభం. రవ్వ హల్వాకంటే శనగపిండి పాయసం అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.
ప్రతీకాత్మక చిత్రం
చాలా మంది రవ్వతో హల్వా చేస్తుంటారు. కానీ శెనగపిండితో పాయసం అనేది కొత్తగా అనిపిస్తుంది కావచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. దాని రుచి చూసి మళ్లీ మళ్లీ చేస్తారు. శనగపిండితో మిర్చీలు, బజ్జీలు, పకోడీలు చేస్తారు. హల్వా కూడా చేస్తారని విచిత్ర పోకండి. రవ్వ పాయసం కంటే శెనగపిండిదే మంచి రుచి ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం.
శనగపిండి -200గ్రాములు
నెయ్యి - అరకప్పు
పంచదార- ఒకటిన్నర కప్పు
జీడిపప్పు
బాదం
పిస్తా
ఎండు ద్రాక్ష
కుంకుమపువ్వు
తయారీ విధానం:
స్టెప్ 1 : శెనగపిండి హల్వా చేయడానికి, ముందుగా గ్యాస్ ఆన్ చేయండి. గ్యాస్ మీద పాన్ పెట్టి అందులో అరకప్పు దేశీ నెయ్యి వేయాలి. ఇప్పుడు ఈ నెయ్యిలో 200 గ్రాముల శనగపిండి వేసి బాగా వేయించాలి. శెనగపిండిని ఎర్రగా వేయించుకోవాలి. శనగపిండిని మీడియం మంట మీద మాత్రమే వేయించాలి, లేదంటే మాడిపోతుంది. వేగిన తర్వాత ఒక పాత్రలోకి తీసుకోండి.
దశ 2: ఇప్పుడు అదే పాన్ లో నెయ్యి 2 స్పూన్లు వేయండి.అందులో జీడిపప్పు, బాదం, పిస్తా ఎండుద్రాక్ష సన్నని మంటమీద ప్రై చేయండి. అవి లేత ఎరుపు రంగులోకి మారినప్పుడు వాటిని తీసి పక్కన పెట్టుకోండి.
స్టెప్ 3: ఇప్పుడు అదే పాన్ లో 1 గ్లాసు నీళ్లు పోసి వేడి చేయండి. నీళ్లు వేడి అయ్యాక అందులో ఒకటిన్నర కప్పుల పంచదార వేయాలి. సిరప్ చిక్కగా మారినప్పుడు గ్యాస్‌ను ఆపివేయండి.
స్టెప్ 4: ఇప్పుడు చక్కర పాకంలో, శనగ పిండి వేసి బాగా కలపాలి. హల్వాలో ముద్దలు ఉండకుండా కలుపుకోవాలి. అందులో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేయాలి. అంతే సింపుల్ శెనగపిండి హల్వా రెడీ