మెడిసిన్‌తో పనిలేకుండానే రక్తాన్ని అమాంతం పెంచే ఆహార పదార్థాలు ఇవే..

పౌష్ఠికాహారం అందక చాలా మంది రక్త హీనత సమస్యను ఎదుర్కొంటుంటారు. అన్నిరకాల ఆహార పదార్థాలను సమపాళ్లలో తీసుకోకపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి.

iron rich foods

ప్రతీకాత్మక చిత్రం

పౌష్ఠికాహారం అందక చాలా మంది రక్త హీనత సమస్యను ఎదుర్కొంటుంటారు. అన్నిరకాల ఆహార పదార్థాలను సమపాళ్లలో తీసుకోకపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి. నీరసం, కాళ్లు లాగడం, ఏ పని చేసినా త్వరగా అలసిపోవడం జరుగుతుంటాయి. ఈ రక్తహీనతను తగ్గించి.. రక్తాన్ని పెంచే ఆహార పదార్థాలు ఏవి? అనే విషయం తెలుసుకోవడం కూడా ముఖ్యం. 

మన దేశంలో 57 శాతం మంది మహిళలు రక్తహీనత సమస్యతో బాధ పడుతున్నారు. ఇది మహిళల్లోనే ఎందుకు ఎక్కువగా అంటే.. వాళ్లకి ప్రతినెల నెలసరి సమయంలో బ్లడ్ లాస్ ఉంటుంది కాబట్టి. మరికొందరిలో ఇది ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది. దీనివల్ల రక్తహీనత సమస్య అధికంగా ఉంటుంది. ఎక్కువ ఐరన్ ఉండే ఫుడ్ తీసుకోకపోవడం కుడా కారణం. కడుపులో నులి పురుగులు ఉన్నా రక్తహీనతకు దారితీస్తుంది. అందుకే రక్తహీనతను తగ్గించుకొవడానికి ఐరన్ రిచ్ ఫుడ్ ఉన్న ఆహారాలు తీసుకోవాలి. 

ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవే..

  • ఆకుకూరలలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తోటకూర, పూదీనా, పాలకూర, మెంతికూరలో ఎక్కువగా ఉంటుంది. మీ ఆహారంలో ఏదో ఒక రూపంలో ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. 
  • కూరగాయల్లో అరటిపువ్వు, కాలీఫ్లవర్ కాడాల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.
  • రాగుల్లోనూ ఎక్కువగా ఐరన్ ఉంటుంది. రాగి పిండి లేదా రాగి జావా తీసుకోవడం మంచిది. 
  • నువ్వుల్లో, బెల్లంలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తాటి బెల్లంలో పుష్కలంగా ఐరన్ ఉంటుంది. 
  • బీట్‌రూట్, దానిమ్మ, ఖర్జూర, ఎండుద్రాక్షలో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. 
  • చికెన్ లివర్, మటన్ లివర్‌నూ ఎక్కువ ఐరన్ ఉంటుంది.

సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్