ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న కాలంలో వయసుతో సంబంధం లేకుండా జుట్టు రాలడం మనం చూస్తూనే ఉన్నాం. దానికి కారణం సరైన ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి, శ్రమ, సరైన నిద్ర లేకపోవడం. జుట్టు రాలటం తగ్గి ఒత్తుగా పెరగాలంటే ఈ ఇంటి చిట్కాలు పాటించాల్సిందే..
ప్రతీకాత్మక చిత్రం
ఈవార్తలు, హెల్త్ న్యూస్: ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న కాలంలో వయసుతో సంబంధం లేకుండా జుట్టు రాలడం మనం చూస్తూనే ఉన్నాం. దానికి కారణం సరైన ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి, శ్రమ, సరైన నిద్ర లేకపోవడం. జుట్టు రాలటం తగ్గి ఒత్తుగా పెరగాలంటే ఈ ఇంటి చిట్కాలు పాటించాల్సిందే..
ఉల్లిపాయ రసం : ఉల్లిలో ఉండే జింక్, సల్ఫర్, ఫోలిక్ యాసిడ్, బి విటమిన్, పొటాషియం జుట్టుని ఆరోగ్యంగా ఉంచతాయి. దీని రసంలోని సల్ఫర్ కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దీంతో జుట్టు కుదుళ్ల నుండి దృఢంగా మారుతాయు. ఉల్లిపాయను మెత్తగా దంచి దానిలోని రసాన్ని వడకట్టి జుట్టుకు 15 నిమిషాల పాటు పట్టించి ఆ తర్వాత తలస్నానం చేయండి. ఇలా చేయడం ద్వారా జుట్టు మృదువు గా అవ్వటమే కాకుండా రాలటం కూడా ఆగిపోతుంది.
కలబంద: కలబంద గుజ్జుతో జుట్టు రాలటం అరికట్టవచ్చు. కలబందలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా దీనిలో ఉండే ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గణాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచతాయి. తాజా కలబంద గుజ్జును తలకి పట్టించి 10 లేదా 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత తలంటు స్నానం చేయాలి. ఇలా వారానికి ఒక్కసారి చేయటం మంచిది.
కొబ్బరి నూనె: కొబ్బరి నూనె మన జుట్టుకు సహజమైన మాయిశ్చరైజర్. ఇది జుట్టు రాలటాన్ని ఆపుతుంది. ఈ నూనెలో లాజిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. దీనికి యాంటీమైక్రోబయాల్ లక్షణాలు ఉంటాయి. మీరు జుట్టు రాలటం వంటి సమస్యతో బాధపడుతుంటే కొబ్బరి నూనెను డబుల్ బాయిలర్ విధానంలో వేడి చేసి తలకు మసాజ్ చేసి ఒక రాత్రికి అలా వదిలేయండి. మరుసటి రోజు తలస్నానం చేయండి.
ఆహారం: చేపలు- చేపల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే హెర్రింగ్, సార్డినెస్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ లాంటివి జుట్టు రాలట్టాన్ని అరికడతాయి.
డ్రై ఫ్రూట్స్: అవిసె గింజలు, బాదం, వాల్‌నట్, జీడిపప్పు, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలను క్రమం తప్పకుండా తీనుకోవాలి. ఇందులో ఉండే బయోటిన్ కంటెంట్ జుట్టు రాలటాన్ని నివారిస్తుంది.
ఆకుకూరలు: ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవటం ద్వారా జుట్టు పెరుగుదల పెరుగుతుంది. ఆకుకూరలో ఐరన్ ఎక్కువగా ఉండి జుట్టు రాలడంతో పాటు జుట్టు పగుళ్లను కూడా అరికడుతుంది.