చాలా మంది భార్యాభర్తల్లో డెలివరీ తర్వాత ఎన్ని రోజులకు శృంగారంలో పాల్గొనాలి అనే సందేహం ఉంటుంది. ఓపెన్‌గా అడగటానికి ఇబ్బంది పడుతుంటారు. నార్మల్ డెలివరీ కానీ, సిజేరియన్ గానీ అయిన తర్వాత శృంగారంలో ఎప్పుడు కలవాలి?
ప్రతీకాత్మక చిత్రం
చాలా మంది భార్యాభర్తల్లో డెలివరీ తర్వాత ఎన్ని రోజులకు శృంగారంలో పాల్గొనాలి అనే సందేహం ఉంటుంది. ఓపెన్‌గా అడగటానికి ఇబ్బంది పడుతుంటారు. నార్మల్ డెలివరీ కానీ, సిజేరియన్ గానీ అయిన తర్వాత శృంగారంలో ఎప్పుడు కలవాలి? కలిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది? అనే డౌట్స్‌ని క్లియర్ చేసుకుందాం.
ఒక స్త్రీ బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. అంటే డెలివరీకి ముందు ఒకలా, డెలివరీ తర్వాత ఒకలా ఉంటుంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బాలింతల శరీరంలో హార్మోన్ల మార్పులు చోటుచేసుకుంటాయి. అలాగే నిద్ర లేకపోవడం, బిడ్డకు పాలివ్వడం, నడుం నొప్పి.. ఇలా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అదేవిధంగా గర్భ సంచి మళ్లీ యథావిధిగా మార్పు చెందడానికి రెండు, మూడు నెలల సమయం పడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు డెలివరీ తర్వాత భార్యాభర్తల కలయికకు రెండు, మూడు నెలలు విరామం తప్పక తీసుకోవాలి. డెలివరీ తర్వాత కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్లు అప్పుడప్పుడే తగ్గుతుంటాయి కాబట్టి వెంటనే భార్యాభర్తలు శృంగారంలో పాల్గొనడం మంచిది కాదు.
సిజేరియన్ అయిన వారికి కుట్లు కుదురుకోవడానికి సుమారు రెండు నెలల సమయం తప్పకుండా పడుతుంది. ఈ రెండు నెలల తర్వాత మహిళలు శారీరకంగా, మానసికంగా ఓకే అన్నప్పుడు మాత్రమే కలవడానికి ప్రయత్నించాలి. కలయిక సమయంలో జాగ్రత్తలు, వైద్యుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. కొందరు ఫీడింగ్ టైంలో పీరియడ్ రాలేదు కదా.. మళ్లీ ప్రెగ్నెన్సీ వచ్చే చాన్స్ ఉండదేమో అనుకొని ఎలాంటి జాగ్రత్తలు లేకుండానే శృంగారంలో పాల్గొంటారు. కానీ ఫీడింగ్ సమయంలో పీరియడ్స్ రాకపోయినా రెండు నెలల తర్వాత అండం విడుదల మొదలవుతుంది. కాబట్టి ఈ కలయిక వల్ల మళ్లీ ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ.