భూమి మీద జీవం బతకాలంటే నీరు తప్పనిసరి. శరీరంలో నీటి కొరత కారణంగా,ఆరోగ్యం ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. నీరు లేకుండా మనం ఎన్ని రోజులు జీవించగలమో తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం
మనం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారంతోపాటు నీళ్లు కూడా చాలా ముఖ్యం. నీళ్లు తాగకుండా మనుషులు బతకలేరు. శరీరంలో సరైనంత నీరు లేకుంటే అనేక తీవ్రమైన సమస్యలకు గురవుతుంటారు.నీరు లేకపోవడం అంటే డీహైడ్రేషన్ కూడా మీ జీవితాన్ని కోల్పోయేలా చేస్తుంది. కేవలం కొన్ని రోజులు నీరు తాగకపోవడం వల్ల శరీరం అలసిపోయి..శరీర అవయవాలు పనిచేయకపోవడం వల్ల మరణానికి కూడా దారితీస్తుంది.
ఒక వ్యక్తి ఎంతకాలం జీవించగలడు?
శరీరంలో దాదాపు 70శాతం నీరు అవసరం. నీళ్ళు లేకుండా ఎక్కువ కాలం జీవించడం సాధ్యం కాదనడానికి ఇదే కారణం. రూల్ ఆఫ్ 3 ప్రకారం, మనిషి గాలి లేకుండా 3 నిమిషాలు, నీరు లేకుండా 3 రోజులు, ఆహారం లేకుండా 3 వారాలు జీవించగలడు. నీరు లేకుండా ఒక వ్యక్తి కేవలం 3 రోజులు మాత్రమే జీవించగలడు. అయితే, జీవించే పరిమితి వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు.
నీళ్లు తాగడం చాలా ముఖ్యం:
ఆహారం, నీరు శరీరానికి అవసరమైన కొన్ని ప్రాథమిక అవసరాలు. ఈ రెండింటికి ఎక్కువ కాలం దూరంగా ఉంటే సమస్యలను ఆహ్వానించినట్లే. ఒక రోజులో అంటే 24 గంటల్లో పురుషులకు 3.6 లీటర్ల నీరు, స్త్రీలకు 2.6 లీటర్ల నీరు అవసరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, నీటి అవసరం వయస్సు, ఎత్తు, బరువు వంటి ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది.
నీరు త్రాగకపోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు:
మీరు మీ శరీర అవసరాలకు అనుగుణంగా నీరు త్రాగకపోతే, మీరు డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది. వేసవిలో డీహైడ్రేషన్ సమస్య కూడా ప్రాణాంతకం కావచ్చు. అంతే కాకుండా శరీరంలో నీరు లేకపోవడం వల్ల కూడా రక్తపోటు తగ్గుతుంది. నిర్జలీకరణం మీ మూత్రపిండాలు, కాలేయం, మెదడు ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. అందువల్ల, మీ శరీరంలో నీటి కొరత ఏర్పడకుండా నిరోధించాలి.