సిగరెట్ తాగుతున్నారా.. ఈ వార్త చదివితే మీ మైండ్ బ్లాంక్

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

ఈవార్తలు, సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్: తలనొప్పిగా ఉంది.. వెంటనే ఒక సిగరెట్ తాగెయ్యాలి.. ఒక్క పఫ్ కొట్టగానే మెదడుకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది.. మైండ్ రీఫ్రెష్ అవుతుంది అనుకొంటున్నారా? అయితే మీరు అనుకున్నది కాకపోగా, మెదడు డేంజర్‌లో పడిపోతుందట. ధూమపానంతో మెదడు కుచించుకుపోతుందని తాజాగా వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అధ్యయనంలో తేలింది. ధూమపానం వల్ల కలిగే ముప్పు సగం జీన్స్ ద్వారానే వస్తుందని వెల్లడైంది. సాధారణంగా మెదడు పరిమాణం వయసుతో పాటు తగ్గడం కనిపిస్తుంది. కానీ, ధూమపానం వల్ల అది ముందుగానే జరుగుతుందని పరిశోధకులు వెల్లడించారు. ధూమపానం చేసేవారు వయసు సంబంధిత సమస్యలతో ఎందుకు ఎక్కువగా బాధపడుతుంటారో, మతిమరపు వ్యాధి ఎందుకు వస్తుందో ఈ అధ్యయనం ద్వారా గుర్తించామని వివరించారు.

శాస్త్రవేత్తలు ఇప్పటివరకు ధూమపానంతో మెదడుపై పడే ప్రభావం గురించి పెద్దగా పరిశోధనలు జరపలేదు. ఇప్పటి వరకు చేసిన పరిశోధనలన్నీ గుండె, కాలేయం తదితర అవయవాల లక్ష్యంగానే జరిగాయి. అయితే, వాషింగ్టన్ వర్సిటీ శాస్త్రవేత్తలు మెదడుపై ప్రభావాన్ని పరిశీలించగా, ఈ సంచలన విషయం బయటపడింది. వీలైనంత వరకు ధూమపానానికి దూరంగా ఉంటేనే మంచిదని, అల్జీమర్స్ నుంచి రక్షణ పొందొచ్చని పరిశోధకులు వెల్లడించారు. సమస్య తీవ్రమైతే ఆ నష్టాన్ని పూడ్చటం కష్టమని పేర్కొన్నారు.

వెబ్ స్టోరీస్