Glowing Skin: బ్యూటీ పార్లర్ వెళ్లకుండా ఇంట్లోనే తయారు చేసుకునే ఈ ఫేస్‎ప్యాక్‎లతో ముఖం మెరిసిపోతుంది

బంగాళదుంప అందరికీ ఇష్టమైన ఆహారం. అయితే బంగాళాదుంప చర్మ సంరక్షణకు కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా. బంగాళాదుంప నీరు ముఖంపై మచ్చలు పోగొట్టేలా చేస్తుంది. మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. పొటాటో వాటర్ వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం

potato face mask

ప్రతీకాత్మక చిత్రం 

బంగాళదుంప అందరికీ ఇష్టమైన ఆహారం. అయితే బంగాళాదుంప చర్మ సంరక్షణకు కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా. బంగాళాదుంప నీరు ముఖంపై మచ్చలు  పోగొట్టేలా చేస్తుంది. మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. పొటాటో వాటర్ వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

బంగాళాదుంప చర్మ సంరక్షణ ప్రయోజనాలు:  

పెరుగుతున్న కాలుష్యం, రోజువారీ కార్యకలాపాల కారణంగా, దుమ్ము, మట్టి, అనేక రకాల మురికి ముఖంపై పేరుకుపోతుంది. ఇది ముఖంలోని సహజమైన గ్లోను దొంగిలిస్తుంది. సహజమైన మెరుపును తిరిగి తీసుకురావడానికి బంగాళాదుంప నీటిని అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. ముఖాన్ని డీప్ క్లీనింగ్‌తో పాటు, ఇది హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. దీని కారణంగా ముఖం  సహజమైన గ్లో అలాగే ఉంటుంది.

పొటాషియం, విటమిన్ సి, అనేక ఇతర పోషకాలు బంగాళాదుంప నీటిలో కనిపిస్తాయి. ఇది ముఖంపై టానింగ్‌ను తగ్గిస్తుంది. అదనపు నూనె,మృతకణాలను తొలగిస్తుంది.ఫైన్ లైన్ల సమస్యను తగ్గిస్తుంది . దీనితో పాటు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. కాబట్టి బంగాళాదుంప నీటిని తయారుచేసే విధానం, దాని ఉపయోగాలు, దాని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

బంగాళాదుంప నీటిని తయారు చేసే విధానం:

పచ్చి బంగాళదుంపలను పొట్టు తీసి కడిగి ముక్కలుగా కోసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు దాన్ని ఫిల్టర్ చేసి రసం తీయండి.

ఇది చర్మానికి ఎలా ఉపయోగపడుతుంది?

ముఖం డీప్ క్లీనింగ్ కోసం:

ముఖం డీప్ క్లీనింగ్ కోసం, సిద్ధం చేసుకున్న బంగాళాదుంప నీటిలో దూదిని ముంచి, మీ ముఖం, మెడ, చేతులకు అప్లై చేసి మృదువుగా మసాజ్ చేసి, కాసేపు అలాగే ఉంచండి. అరగంట తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ముఖం నుండి అదనపు జిడ్డు, మురికిని తొలగించి డీప్ క్లీన్ చేస్తుంది.

ఫేస్ మాస్క్‌గా:

ఒక చెంచా ముల్తానీ మిట్టిని బంగాళాదుంప రసంలో నానబెట్టండి. ఇప్పుడు దానికి ఒక చెంచా తేనె మిక్స్, రోజ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని మీ ముఖానికి పట్టించి అరగంట తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల ముఖం ఎప్పుడూ కాంతివంతంగా ఉంటుంది.

మృదువైన, మెరిసే చర్మం కోసం:

రెండు టేబుల్ స్పూన్ల బంగాళాదుంప రసంలో ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేసి మీ ముఖానికి అప్లై చేయండి. 15-20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడగాలి. దీన్ని వారానికి రెండు సార్లు ఉపయోగిస్తే చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉంటుంది .


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్