మగవారిలో అంగస్తంభన సమస్య ఉండటం సహాజం. ఈ సమస్యను ఎవరికి చెప్పుకోలేక, ఎలా పరిష్కారించుకోవాలో అనే విషయంలో చాలా సతమతం అవుతుంటారు.
ప్రతీకాత్మక చిత్రం
చాలా మంది పురుషులు అంగస్తంభన సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్యను ఎవరికి చెప్పుకోలేక, ఎలా పరిష్కారించుకోవాలో అనే విషయంలో తెలియక సతమతం అవుతుంటారు. మగవారిలో అంగస్తంభన సమస్య ఉన్నప్పుడు ఇంట్లోనే కామన్‌గా దొరికే ఆహార పదార్థాలతో, సహజ పద్ధతుల్లో సరిచేసుకోవచ్చు. ఎలాగంటే.. అంగస్తంభన సమస్య ఉండటానికి కారణం కొంతమంది మగవారిలో ఉత్పత్తి అయ్యే టెస్టోస్టిరాన్ (testosterone) లెవెల్స్ తక్కువగా తయారవుతూ ఉండటం. టెస్టోస్టిరాన్ (testosterone) లెవెల్స్ అనేవి తక్కువగా ఉన్నప్పుడు మగవారిలో మూడ్ గానీ, సెక్స్‌వల్ యాక్టివిటీలో ఆసక్తి గానీ ఉండదు. అంగం గట్టిపడటం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. వయసు పెరిగే కొద్దీ ఈ సెక్స్‌వల్ డిసైర్ అనేది తగ్గుతూ ఉంటుంది.
వయసు పెరిగే కొద్ది వచ్చే డయాబెటిస్ గానీ, హై బ్లెడ్ ప్రెజర్గా నీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతున్నప్పుడు గానీ.. ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఇంట్లోనే ఇలాంటి సమస్యను ఎలా చెక్ పెట్టాలి అంటే.. ముందుగా మెంతులు అవసరం. మెంతులు మనకు అందుబాటులో ఉంటాయి. మెంతులు, మెంతికూర మన రోజూ ఆహారంగా తీసుకోవడం చాలా మంచిది. మెంతులను రాత్రి పడుకునే ముందు నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే తాగడం వల్ల శరీరంలో ఉండే కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. అలాగే షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడంలో కూడా మెంతులు చురుగ్గా పనిచేస్తాయి. మెంతులను తీసుకోవడం వల్ల టెస్టోస్టిరాన్(testosterone) లెవెల్స్ పెరిగి అంగస్తంభన సమస్య దూరం పెట్టవచ్చు. మెంతులను రోజుకు 100 మిల్లీగ్రాములు తీసుకోవచ్చు. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇలా మెంతులను రోజు తీసుకున్నా ఎలాంటి మార్పు లేకపోతే వైద్యులను సంప్రదించడం మంచిది.