ఆయుర్వేదంలో కూడా ఈ శంఖు పుష్పాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ శంఖు పువ్వుల వేర్లను శుభ్రంగా కడిగి దంచి రసం తీయాలి. దీనికి తేనే కలిపి తీసుకుంటే జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది.
ప్రతీకాత్మక చిత్రం
శంఖు పుష్ఫాలను సంసృతం లో గిరికర్నిక అంటారు. హిందీలో అపరంజిత అంటారు. ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినవి. ప్రస్తుతం ప్రపంచంలో ఇది చాలా విరివిగా పెరుగుతూ ఉంటాయి. పొలాల కంచెల దగ్గర, రహదారులకు అన్ని వైపులా ఈ చెట్లు మనకి కనిపిస్తునే ఉంటాయి. ఈ పుష్పాలు కలిగిన మొక్కలను దాదాపు అందరూ చూసే ఉంటారు. కానీ మొక్క ఉపయోగం అనేది ఎవరికీ తెలియదు. ఈ శంఖు పుష్పం అనేది ఆయుర్వేదంలో విరివిగా వాడుతూ ఉంటారు. అనేక రోగాల చికిత్సకు వాడుతారు. అంతేకాదు ఇది పెంచడానికి ఒక తోటనే వేస్తారు కొన్ని ప్రాంతాల్లో. అలాగే శంఖు పుష్పాలను వివిధ దేవతలకు పుష్ప పూజకు వాడుతారు. శ్రీ మహవిష్ణువుకు ఎంతో ఇష్టం. ఈ మొక్కలను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులన్నీ పోయి ఐశ్వర్యం కలుగుతుంది. శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి, శనీశ్వరుడికి చాలా ఇష్టమైన పువ్వులు ఇవి. ఎవరైతే ఈ శంఖుపూల చెట్లను ఇంట్లో పెంచుకుంటారో ఆ కుటుంబంపై శ్రీ మహవిష్ణువు, లక్ష్మీ దేవి, శనీశ్వరుని అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అని ఒక నమ్మకం. అలాగే ఈ శంఖు పూల చెట్టు శనీశ్వరుడితో ఉంటుందని చెబుతారు. కాబట్టి ఆ శనీశ్వరుని అనుహ్రగం తప్పకుండా కలుగుతుంది. ఈ పువ్వు నీలం రంగులో ఉంటుంది. ఎవరి ఇంట్లో అయితే ఈ చెట్టు ఉంటుందో వారు బాగా సంపాదిస్తారు. ఆర్థిక ప్రవాహం వాళ్ల ఇంట్లో ఉంటుంది.
అలాగే సోమవారం రోజున 5 శంఖు పుష్పాలను తీసుకోని పారే నీటిలో లేదా నదిలో కలిపితే ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి అని జ్యోతిష్య పండితులు చెబుతారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారు మంగళవారం హనుమంతునికి శంఖు పూలతో పూజ చేయాలి. ఇలా చేస్తే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. అలాగే ఈ శంఖు పుష్పాలు శివయ్యకు ఎంతో ప్రీతికరం. డబ్బు సమస్యలు అధిగమించడానికి సోమవారం రోజున శివలింగానికి ఈ పుష్పాలను సమర్పించండి. ఇక శనివారం రోజున శనిదేవునికి ఆ పుష్పాలను సమర్పిస్తే.. వారి జాతకంలో ఉన్న శని స్థానాన్ని బలపరుస్తుంది. శని దేవుడు మీకు ఉత్తమ ఫలితాలను ప్రసాదిస్తాడు. మీకు డబ్బుకు లోటుండదు. ఉద్యోగంలో ఏవైనా సమస్యలు ఉంటే శంఖు పూలతో పూజ చేయండి. ఆధ్యాత్మికపరంగానే కాకుండా ఆయుర్వేదంలో కూడా ఈ శంఖు పుష్పాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ శంఖు పువ్వుల వేర్లను శుభ్రంగా కడిగి దంచి రసం తీయాలి. దీనికి తేనే కలిపి తీసుకుంటే జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. శంఖు పుష్పం దేవుడి పూజకు ఎంత పవిత్రమైనదో అలాగే ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది.