మహిళల్లో ఈ మధ్య చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య థైరాయిడ్. అందులోనూ ముఖ్యంగా హైపో థైరాయిడ్. ఈ థైరాయిడ్ అనేది ఒక హర్మోనల్ ఇమ్‌బ్యాలెన్స్. ఇది మన మెటబాలిజం, ఎనర్జీ లెవెల్స్, ఇంకా వేరే హర్మోన్స్‌ని కుడా ఎఫెక్ట్స్ చేస్తుంది.
మహిళల్లో ఈ మధ్య చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య థైరాయిడ్. అందులోనూ ముఖ్యంగా హైపో థైరాయిడ్. ఈ థైరాయిడ్ అనేది ఒక హర్మోనల్ ఇమ్‌బ్యాలెన్స్. ఇది మన మెటబాలిజం, ఎనర్జీ లెవెల్స్, ఇంకా వేరే హర్మోన్స్‌ని కుడా ఎఫెక్ట్స్ చేస్తుంది. చాలా మంది డాక్టర్స్ అంటారు.. థైరాయిడ్ ఉన్న వాళ్లు లైఫ్‌లాంగ్ మెడిసిన్ తీసుకోవాలని. కానీ మనం థైరాయిడ్‌ని కంట్రోల్ చేయడానికి ఇంట్లోనే న్యాచురల్ డైట్ ఏంటో చూద్దాం.
ఇప్పుడున్న కాలంలో ప్రతి ముగ్గురు అమ్మాయిల్లో ఒకరికి థైరాయిడ్ సమస్య ఉంటుంది. దీనికి ముఖ్య కారణం వారి ఆహార అలవాట్లు. నిద్ర సరిగ్గ లేకపోవడం, యాక్టీవ్‌గా ఎప్పుడు ఉండకపోవడం, ప్రెగ్నెన్సీ, మెనోపాజ్ కుడా దీనికి ఒక కారణం. ఈ థైరాయిడ్‌ని న్యాచురల్‌గా కంట్రోట్ చేయడానికి ముఖ్యంగా మనం పాటించాల్సింది డైట్. మన డైట్‌లో న్యూట్రిషియన్స్, మినరల్స్ ఉండేలా చూసుకోవాలి.
అయోడిన్: అయోడిన్ అనేది థైరాయిడ్ హర్మోన్‌ని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది అయోడైజ్‌డ్ సాల్ట్‌లోనే కాదు న్యాచురల్ ఫుడ్స్‌లోనూ దొరుకుతుంది. చేపలు, ఎగ్స్, మిల్క్ ప్రోడక్ట్స్‌లోనూ అయోడిన్ ఉంటుంది.
సెలీనియం: సెలీనియం అనేది మనకు ఇన్‌ఆక్టివ్ ఫామ్‌లో ఉన్న థైరాయిడ్ హర్మోన్‌ని ఆక్టివ్ ఫామ్‌లోకి కన్వర్ట్ చేయానికి ఉపయోగపడుతుంది. సెలీనియం ముఖ్యంగా నట్స్, సీడ్స్‌లో ఎక్కువగా ఉంటుంది. బ్రెజిల్ నట్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో ఎక్కువగా ఉంటుంది. హైపోథైరాయిడ్ సమస్య ఉంటే గనుక తీసుకునే ఆహారంతో పాటు నట్స్‌ని కుడా తినడం మంచిది.
జింక్: జింక్ అనేది హర్మోనల్ సింథసిస్‌లో బాగా ఉపయోగపడుతుంది. జింక్ నట్స్, పంప్‌కీన్ సీడ్స్, బీన్స్, శనగల్లో ఎక్కువగా ఉంటుంది.
అశ్వగంధ: థైరాయిడ్ ఉన్న వాళ్లు యాంటీ ఇన్ఫమెంటరీ ఫుడ్స్ తీసుకోవడం మంచిది. పసుపు, అల్లం, మిరియాల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ హైపో థైరాయిడ్ తగ్గించడంలో అశ్వగంధ కుడా చాలా ఉపయోగపడుతుంది. హైపో థైరాయిడ్ కంట్రోల్ చేయడంలో డైట్ ఎంత ప్రాధాన్యమో ఎక్ససైజ్ కుడా అంతే ప్రాధాన్యం.
ఇవి వద్దు:థైరాయిడ్ సమస్యతో ఉన్న వాళ్లు ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ దూరం పెట్టాలి. ఇందులో బిపిఏ ఉంటుంది. ఇవి మన హర్మోన్లను ఇమ్‌బ్యాలెన్స్ చేస్తాయి. షుగర్ ఐటమ్య్ స్వీట్స్, చాక్లెట్స్, కేక్, బేకరి ఐటమ్స్ కూడా దూరం పెట్టడం మంచిది.