Home Remedies | ఎసిడిటీ, షుగర్, అస్తమా వంటి సమస్యలతో బాధపడుతున్నారా?

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

|| ప్రతీకాత్మక చిత్రం ||

ఈవార్తలు, హెల్త్ న్యూస్: ఎసిడిటీ, షుగర్, అస్తమా వంటి సమస్యలతో బాధపడుతున్నారా అయితే నీళ్లతో వీటిని తీసుకుంటే మీకు ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ హోమ్ రెమెడీస్ తో మోకాళ్ళ నొప్పులు, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను దూరం చేయొచ్చు. 

జీలకర్ర నీళ్లు : 

జీర్ణక్రియ సమస్యతో బాధపడే ప్రతి ఒక్కరూ ఈ రెమిడిని ఉపయోగించుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ నీటిలో కొంచెం జీలకర్ర వేసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల జీర్ణవ్యవస్థ సాఫీగా జరుగుతుంది శరీరంలోని కొవ్వు కూడా కరిగిస్తుంది. షుగర్ అధికంగా ఉన్న వాళ్లకు కూడా ఇది మంచి రెమెడీ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఉంటే ఐరన్, విటమిన్ ఏ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మెటబాలిజం పెరిగి షుగర్ లెవెల్స్ ని నియంత్రంలో ఉంచేలా చేస్తుంది. నీళ్లను వారానికి రెండు, మూడుసార్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచి ఫలితం ఉంటుంది. ఈ నీటిని ప్రత్యక్షంగా తాగలేని వారు ఇందులో తేనె కూడా కలుపుకొని తాగవచ్చు. 

వాము నీరు: 

కిడ్నీలలో మూత్రశయంలో రాళ్లు వచ్చిన వారు ఈ వాము నీరుని తాగడం వల్ల రాళ్లు కరిగిపోతాయి. రాత్రి ఒక గ్లాసులో నీటిలో వాము వేసి ఉదయాన్నే తాగాలి. అలాగే శ్వాసకు సంబంధించిన సమస్యలు దగ్గు, జలుబు, అస్తమా వంటి సమస్యలకు చక్కని రెమిడి ఇది. ఈ వాము నీరు వల్ల తిన్న ఆహారాన్ని జీర్ణమైయెల చేసి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. గ్యాస్ ఎసిడిటీ, సమస్యలు దరి చేరకుండా చేస్తుంది. అధిక బరువు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి ఈ వాము నీరు తాగటం వల్ల కాళ్ల నొప్పులు, వాపులు, అధిక కొవ్వును కరిగించి బరువును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే బ్లడ్ షుగర్ తగ్గడానికి కూడా దోహదపడుతుంది.

అల్లం నీరు : 

దగ్గు వల్ల బాధపడుతున్న వారికి అల్లం నీరు చాలా ఉపయోగపడుతుంది ఒక గ్లాసు నీటిలో అల్లం ముక్క వేసి మరిగించాలి. ఈ మరిగిన నీటిలో తేనె కలుపుకొని తాగవచ్చు. మైగ్రీన్ సమస్యతో బాధపడే వారికి అల్లం నీరు  తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నోటి దుర్వాసన, అజీర్ణ సమస్యతో బాధపడే వారికి అల్లం నీరు ఉపయోగపడుతుంది. అల్లం, పుదీనా ఆకులను ఒక గ్లాస్ నీటి తీసుకొని మరిగించి తాగటం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్