మగవారు ఎలాంటి ఆహారం తీసుకుంటే శృంగార శక్తి పెరుగుతుంది? ఏ ఆహారం తీసుకుంటే మగతనం పటిష్టం అవుతుంది? అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి.
ప్రతీకాత్మక చిత్రం
మగవారు ఎలాంటి ఆహారం తీసుకుంటే శృంగార శక్తి పెరుగుతుంది? ఏ ఆహారం తీసుకుంటే మగతనం పటిష్టం అవుతుంది? అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. అయితే, బయటికి చెప్పుకోలేకపోతుంటారు. అలాంటి వారికోసం కొన్ని ఆరోగ్యమైన ఆహార పదార్థాలను వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..
- మాంసం, అవకాడో, ఆపిల్స్, పుచ్చకాయ పండ్లు అవసరమైన పోషకాలను అందించడంతో పాటు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి లైంగిక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతాయి.
- ఖర్జూర పండ్లు, గుడ్లు, తాజా ఆకు కూరలు, మొలకెత్తిన విత్తనాలు, కీరదోస, బీట్ రూట్, క్యారెట్ వీటిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుంది.
- దానిమ్మ, నేరేడు పండ్లు, నిమ్మ పండ్లు కూడా ఆహారంలో చేర్చుకోవాలి. వీటిని వాడటం వల్ల శృంగార శక్తి మెరుగుపడుతుంది.
- అరటిపండులో అధిక స్థాయిలో కాల్షియం, పొటాషియం,విటమిన్ B6 ఉంటాయి. ఇవి శక్తికి, లైంగిక పటుత్వానికి గొప్పవి. కాబట్టి అరటిని ఎక్కువగా తీసుకోవడానికి ప్లాన్ చేసుకోండి.
- మునగాకు తీసుకొని అందులోకి ఉప్పు, పసుపు వేసి బాగా ఉడకనివ్వాలి. మెత్తగా పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ప్రతిరోజు రోజు బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత రెండు స్పూన్లు తింటే మగవారిలో వీర్య వృద్ధి చెందుతుంది. అంతేకాకుండా శీఘ్ర స్కలనం సమస్య తగ్గడమే కాకుండా, లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.
- బెండకాయ కూడా శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. లైంగిక సమస్యలను తగ్గిస్తుంది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. కాబట్టి మీ ఫుడ్ లో బెండకాయ తరచుగా ఉండేలా ప్లాన్ చేసుకోండి.
- కోడిగుడ్డులో విటమిన్ బీ5, విటమిన్ బీ6 పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తాయి. అంతేకాకుండా లైంగిక వాంఛను కలిగిస్తాయి.
- అలసట, అతి త్వరగా స్కలనం కావటం వంటి సమస్యలతో బాధపడేవారికి క్యారెట్ ఉత్తమ ఔషధం. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల లైంగిక సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు.
- శృంగార సామర్థ్యాన్ని పెంచడంలో ఎండుద్రాక్ష చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దీన్ని తింటే పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. ఒంట్లో నీరసం తగ్గుతుంది. ఉత్సాహంగా ఉంటారు. కిస్మిస్‌లను తినడం వల్ల లైంగిక జీవితం మెరుగుపడుతుంది. వీటిని తినటం వల్ల సంతాన సాఫల్యత మెరుగుపడుతుందని ఆయుర్వేదం చెబుతోంది.
- వెల్లుల్లిలో యాంటీ-అఫ్రోడిసియాక్ లక్షణాలు ఉన్నాయి. తక్కువ లిబిడో వంటి లైంగిక సమస్యలను ఇది నివారిస్తుంది.
- శరీరంలో ఐరన్ కంటెంట్‌ను పెంచడంలో ఖర్జూర చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అధిక స్థాయిలో పోషకాలను కూడా కలిగి ఉంటుంది. ఇది శృంగారాన్ని ప్రోత్సహించే శక్తిని కూడా ఇస్తుంది. కాబట్టి లైంగిక సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఖర్జూరను ఎక్కువగా తీసుకోండి.