|| ప్రతీకాత్మక చిత్రం ||
వయసుతో సంబంధం లేకుండా పిల్లలకి, పెద్దలకి అందరికీ ఏదో ఒక విటమిన్ లోపంతో హాస్పిటల్ వెళ్ళవలసి వస్తుంది. మనం తీసుకునే ఆహారం మన శరీరంపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఆకుకూరలు తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఆకుకూరలు తినడం వల్ల అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను ప్రోటీన్లను శరీరానికి అందుతాయి. ఏ ఏ ఆకు కూరలు ఎలా ఉపయోగపడుతాయో తెలుసుకుందాం..
కరివేపాకు : కరివేపాకును మనం కూరలో వేసుకోవడానికి వాడతాం. కానీ కూరల్లో తినేటప్పుడు వస్తే తీసి పక్కన పెడతాము. కానీ, కరివేపాకులో ఎక్కువగా బయోటిన్ ఉండటం వల్ల జుట్టు సంరక్షణకు, తీసుకున్న ఆహారం అడుగుదలకు కరివేపాకు చాలా ఉపయోగపడుతుంది.
కొత్తిమీర : కొత్తిమీరను కూరలో గార్నిష్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి దీనిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరంలో కణాల ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే శరీర మృదువుగా మారడానికి దోహదపడుతుంది. వృధ్యప్య లక్షణాలను తగ్గిస్తుంది.
కాలీ ఫ్లవర్ : కాలీఫ్లవర్ లో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలకు, పంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది.
మెంతి కూర : మెంతికూరలో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల మధుమేహులకు, అధిక బరువు కలవారికి, గుండె, కాలయ వ్యాధులతో బాధపడుతున్న వారికి దీన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
పుదీనా : పుదీనాలో ఆంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి దీనిని తీసుకోవడం వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది అలాగే తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది.
పొన్నగంటి కూర : పొన్నగంటి కూరలో కాల్షియం, విటమిన్ ఏ అధికంగా లభిస్తాయి. శరీరంలోని క్రిములను నాశనం చేసేందుకు అలాగే శరీరంలో వేడి తగ్గించేందుకు, ఎముకల బలాన్ని పెంచి మనిషిని దృఢంగా అయ్యేట్టు పొన్నగంటి కూర దోహదపడుతుంది.
మునగాకు : మునగాకులు ఐరన్, కాపర్, విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువగా లభిస్తాయి. మునగాకు తీసుకోవడం వలన రక్తహీనతను నివారించి, ఎముకలు బలంగా ఉండడానికి సహాయపడుతంది.
క్యాబేజి : క్యాబేజీలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, ఫైబర్, జింక్, ఫాస్పరస్, మెగ్నీషియం, ఫోలేట్, నియాసిన్, కాల్షియం వంటి పోషకాలు అందుతాయి. నరాల బలహీనత తో ఇబ్బంది పడేవారు అలాగే మధుమేహులకు క్యాబేజీ తీసుకోవడం వల్ల శరీరాన్ని కాపాడుకోవచ్చు.
గోంగూర : గోంగూరలో విటమిన్ ఏ ఎక్కువగా లభిస్తుంది దీని వలన కంటికి సంబంధించిన వ్యాధులను నివారించుకునే అవకాశం ఉంటుంది.
చుక్కకూర : చుక్కకూరలో మెగ్నీషియం విటమిన్ ఏ అధికంగా లభిస్తాయి దీనిని తీసుకోవడం వలన గుండెను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు.
బచ్చలి కూర : బచ్చలి కూరలు పోలిక్ యాసిడ్, విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. శరీరంలో కొత్తగా రక్త కణాలు ఏర్పడడానికి సహాయపడుతుంది రోగ నిరోధక శక్తిని పెంచి రక్తహీనతను నివారిస్తుంది.
తోటకూర : తోటకూరలు కాల్షియం, ఐరన్, ఆంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. తోటకూర తీసుకోవడం వలన రక్తహీనత నివారించవచ్చు. అలాగే ఎముకల బలానికి రక్త కణాల పెరగడానికి రోగ నిరోధక శక్తి ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.