|| ప్రతీకాత్మక చిత్రం ||
ఆకుకూరలు మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. అందులో పుదీనా ఒకటి. పుదీనా మన ఆహారంలో చేర్చుకోవడం వలన మన జీర్ణశక్తి మెరుగుపడుతుంది. పుదీనా రసం, పుదీనా ఆకులు తీసుకోవడం వలన శరీరానికి, మన ఆరోగ్యానికి ఎంతో మేలు. పుదీనాలో శరీరానికి అవసరమైన ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది సువాసనకే కాకుండా వంటలలో కూడా రుచిని, గుమగుమలాడే వాసనను వెదజల్లుతుంది.
మన ఆహారంలో చేర్చుకోవడం వలన కలిగే లాభాలు ఏంటో చూద్దాం..
పుదీనాలో విటమిన్ C , విటమిన్ D , విటమిన్ E , విటమిన్ B, క్యాల్షియం, పాస్పరస్ వంటి మూలకాలు వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పుదీనా శరీరానికి కాకుండా, సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుంది. నోటి దుర్వాసన, గొంతులో మంట, కడుపులో మంటతో బాధపడుతున్నవారికి కొంచెం పుదీన రసం తీసుకుని అందులో తేనె, నిమ్మకాయ రసం కలుపుకొని తాగడం వలన ఉపశమనం లభిస్తుంది. గర్భవతులకు వాంతులు అవుతుంటే వారు పుదీనా రసంలో తేనె నిమ్మకాయ రసం కలుపుకొని కొద్దికొద్దిగా తాగడం వలన వాంతులు నెమ్మది, నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి. మానసిక ఒత్తిడి నిద్రలేమిటో బాధపడే వారికి పుదీనా చక్కటి పరిష్కారం. పుదీనా ఆకులను ఒక గ్లాసు నీళ్లలో అరగంట సేపు నానబెట్టి, అరగంట తర్వాత ఆ నీళ్లను తాగటం వలన మంచి నిద్రలోకి జారుకుంటారు. వికారం వాంతులతో బాధపడే వారికి పుదీన రసం తాగడం వలన ఉపశమనం లభిస్తుంది.
ఇక అందానికి కూడా పుదీనా మంచి రెమెడీ. పుదీనా ఎండాకాలంలో ఏర్పడే ట్యాన్ ని తొలగించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. పుదీనాలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ చర్మంపై ఉండే మొటిమలను తగ్గిస్తుంది. అలాగే మొటిమలు రాకుండా ఉపయోగపడుతుంది. పుదీనా కీరదోస వీటిని సమపాలుగా తీసుకొని ముఖానికి అప్లై చేయడం వలన చర్మం మెరిసిపోవడంతో పాటు వేసవిలో ముఖం పైన తేమను ఉంచేందుకు ఉపయోగపడుతుంది. అలాగే పుదీనా, ముల్తాని మట్టి, పుదీనా,తులసి ఆకుల పేస్టులను ముఖానికి అప్లై చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. మొటిమలు, ట్యాన్, మచ్చలు నివారించేందుకు మంచి రెమిడీగా పుదీనా ఉపయోగపడుతుంది.