Health Tips: ఎండు ద్రాక్షను నానబెట్టి తినే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

మనలో కొంతమంది బ్రేక్ ఫాస్టులో డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు. అందులో ఎండు ద్రాక్షను ఎక్కువగా తీసుకుంటారు. అయితే కొంతమంది ఎండు ద్రాక్షను నానబెట్టుకుని తింటారు. అయితే ఎండు ద్రాక్షను నానబెట్టుకుని తింటే ఆరోగ్యానికి మంచిదా? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Raisins

ప్రతీకాత్మక చిత్రం 

మనం ఉపయోగించే అనేక  డ్రైఫ్రూట్స్ లో  ఎండు ద్రాక్ష ఒకటి. మనం రకరకాల తీపి వంటకాలలో ఎండు ద్రాక్షను తప్పకుండా ఉపయోగిస్తాము. దీంతో తీపి రుచి పెరుగుతుంది. ఎండు ద్రాక్షకు అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే శక్తి ఉంది. వైద్యుల సూచన ప్రకారం ఎండు ద్రాక్షను  ఖాళీ కడుపుతో తినడం మన శరీరానికి మంచిది. ఎందుకంటే ఇది మన శరీరానికి ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని, పోషకాలను అందిస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది నీళ్లలో నానబెట్టిన ఎండుద్రాక్షను ఖాళీ కడుపుతో తింటున్నారు. ఇలా తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం. 

దంతాలకు మంచిది: 

మనం ఎప్పుడూ నోరు శుభ్రంగా ఉంచుకోవాలంటే ఎండు ద్రాక్ష ఎంతో మేలు చేస్తుంది. మన దంతాలు, చిగుళ్లు, నాలుకను శుభ్రపరుస్తుంది. ఎందుకంటే ఎండు ద్రాక్షలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.  ఒలినోలిక్ యాసిడ్ అనే సహజమైన ఫైటోకెమికల్ ఉంటుంది.మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని మితంగా తీసుకోవడమే కాకుండా, దంతాల ఆరోగ్యం కోసం ఎవరైనా ఉదయాన్నే ఎండుద్రాక్ష తినడం అలవాటు చేసుకోవచ్చు.

ఇమ్యూనిటీ : 

వర్షాకాలం అయినా, చలికాలం అయినా మన రోగనిరోధక శక్తి బాగుంటే ఎలాంటి అనారోగ్య సమస్యల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు.ఎండుద్రాక్షలో విటమిన్ సితో పాటు విటమిన్ బి కూడా పుష్కలంగా ఉంటుంది, ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా అనేక వ్యాధుల నుండి మనలను కాపాడుతుంది.

అందాన్ని మెరుగుపరుస్తుంది:

రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష తినడం అలవాటు చేసుకున్న వారు సాధారణంగా అందంగా కనిపిస్తారని అందరూ అంటున్నారు.ఎందుకంటే దీని వల్ల వారి చర్మం గ్లో పెరుగుతుంది. అంతేకాకుండా వివిధ రకాల చర్మ సమస్యలు కూడా దూరం అవుతాయి. ఎండుద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు  సహాయపడతాయి.

కంటిచూపు: 

ఎండుద్రాక్షలో కనిపించే యాంటీఆక్సిడెంట్లు పాలీఫెనాల్స్ రూపంలో ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా చిన్నతనంలో కంటిపొర, శుక్లాలు వంటి సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్