|| ప్రతీకాత్మక చిత్రం ||
మాంసాన్ని అతిగా తింటున్నారా.. అయితే దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్, మటన్ ఇలా ఏదో ఒకటి తింటూనే ఉంటాం. వీటితో బిర్యానీ, ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకుని తినడం. ఇంకా రకరకాల వంటలు మాంసతో తయారు చేసుకుని తింటూ ఉంటాం. అయితే వారానికి ఒకటో, నెలకు రెండు, మూడు సార్లు తినడం వల్ల శరీరాన్ని కావలసిన పోషకాలు అందుతాయి. కానీ అతిగా తినడం వల్ల శరీరానికి నష్టం కలుగుతుందని అంటున్నారు. అయితే శరీరానికి ఎంత మోతాదులో మాంసం తీసుకోవాలి. అధికంగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం..
మాంసంలో కార్బోహైరేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు శరీరానికి పుష్కలంగా లభిస్తాయి. మాంసం తినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. అయితే మాంసం పరిమితంగా మాత్రమే తీసుకోవడం వల్ల శరీరం బాగా అభివృద్ధి చెందుతుంది. ఇందులో ఉండే ప్రోటీన్స్ శరీరానికి అందుతాయి. మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి 24 గంటలు పడుతుంది. ఇక మాంసం అయితే ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటుంది. శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుందని కరోనా తర్వాత ఎక్కువగా మాంసం తింటున్నారు. కానీ అతిగా తినడం వల్ల కూడా అనారోగ్యాలు, క్యాన్సర్, గుండెపోటు వంటివి వస్తాయి.
అధికంగా మాంసం తీసుకోవడం వల్ల వచ్చే సమస్యలు :
మాంసం అతిగా తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభమవుతుంది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మాంసం జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల ప్రేగులపై ఒత్తిడిపడి ప్రేగులకు సంబంధించిన వ్యాధులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మాంసాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. మాంసంలో జింక్, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. వీటి వాళ్ళ కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా పెరుగుతుంది. శరీర బరువు పెరిగి ఉబ్బకాయ సమస్యలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మాంసం ఎక్కువగా తీసుకోవడం వల్ల జీవితకాలం తగ్గుతుందని ఓ సంస్థ ఇచ్చిన నివేదికలో వెళ్లడయింది. మాంసం జీర్ణం కాక మలబద్ధక సమస్య ఏర్పడుతుంది. అలాగే విసర్జన వ్యవస్థపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఇక మాంసం అతిగా తినడం వల్ల క్యాన్సర్ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు.