||ప్రతీకత్మక చిత్రం||
అందమైన ముఖం కోసం.. యవ్వనంగా కనబడేలంటే ప్రతి మహిళ తీసుకోవాల్సిన టిప్స్ ఇవే.. మన రోజువారి ఆహారంలో ఇవి చేర్చడం ద్వారా వయస్సు పైబడిన కూడా యవ్వనంగా ఉంచే ఈ ఆహార నియమాలు తప్పక పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు. వయస్సు పెరుగుతున్న చర్మం ముడతలు పడకుండా ఉండాలంటే ఈ ఆహారం రోజు తీసుకోవాల్సిందే..
బొప్పాయి (papaya):
బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ వల్ల శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. ఇది చర్మానికి కాంతివంతంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. బొప్పాయితో మన అందాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకూందాం.. బొప్పాయిలో క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్-ఏ, బీ, సీ, ఈ, కేలతోపాటు ఫోలేట్ వంటి పోషకాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మన అందాన్ని పెంచడానికి సహాయపడుతోంది. టేబుల్ స్పూన్ బొప్పాయి గుజ్జులో ఒక స్పూన్ తులసి పొడి, తేనె కలిపి రోజూ ఉదయాన్నే ముఖానికి అప్లై వల్ల చర్మం ముడతలు పడకుండా చేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా మెరిపిస్తుంది.
దానిమ్మ (pomegranate):
దానిమ్మ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, చర్మానికి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. వివిధ రకాల చర్మ వ్యాధులను నివారించడానికి దానిమ్మను వాడాలని నిపుణులు తెలియజేశారు. దానిమ్మ రుచికరమైన పండే కాకుండా, చర్మ ఆరోగ్యాన్ని వృద్ధిచేసి, చర్మ సమస్యలను తగ్గించి అందాన్ని మెరుగుపరుస్తుంది. దానిమ్మలో ఉండే నూనెలు, బాహ్యచర్మ కణాలకు శక్తిని అందించి, చర్మంపై ముడతలు పడకుండా చేస్తోంది. మనందరికీ చర్మ సమస్యలు ట్యాన్, మచ్చలు, పొడి చర్మం వంటి వాటికి పరిష్కారం కోసం దానిమ్మ చాలా ఉపయోగపడుతుంది.
క్యారెట్ (carrot):
క్యారెట్‌లో విటమిన్ సీ, యాంటిఆక్సిడెంట్లు ఉండి చర్మాన్ని మెరిసేలా చేసేందుకు ఉపయోగపడుతుంది. క్యారెట్లు తినడం వలన చర్మం ఆరోగ్యంగా, మృదువుగా మరుతుంది. క్యారెట్‌ను మెరిసే చర్మం కోసం ముఖంపై అప్లై చేయాలి. క్యారెట్ జ్యూస్ వారానికి కనీసం రెండుసార్లు అయినా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం ముడతలు పడకుండా చర్మం కాంతివంతంగా ఉంటుంది.