|| ప్రతీకాత్మక చిత్రం || గుండె పదిలంగా ఉందా.. ? అసలు ఏ వయస్సు వారు గుండె పదిలంగా ఉంచుకోవాలి.. అనే దానికి సమాధానం లేదు. ఎందుకు అంటే ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా కార్డియాక్ అరెస్టు, హార్ట్ ఎటాక్ వస్తున్నాయి. అయితే వీటి నుండి మనం బయటపడే అవకాశం ఉందా..? ప్రాథమిక చికిత్స చేయడం వల్ల బతికే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అసలు కార్డియాక్ అరెస్ట్ అంటే.. హార్ట్ ఎటాక్.. వీటిని ఎలా తెలుసుకోవాలి. ఒకవేళ కార్డియాక్ అరెస్ట్ గురైన వారిని ఎలా రక్షించుకోవాలి.
కార్డియాక్ అరెస్ట్ అంటే ఆకస్మాత్తుగా గుండె ఆగిపోవడం. అంటే గుండె పనితీరు పూర్తిగా తగ్గిపోవడం లేదా 200 కంటే ఎక్కువగా కొట్టుకుని సడెన్ గా ఆగిపోవడం వల్ల కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుంది. ఇలా ఆకస్మాత్తుగా వ్యక్తికి కార్డియాక్ అరెస్ట్ సంభవించినప్పుడు సీపీఆర్ చేసి బ్రతికించుకోవచ్చు. సీపీఆర్ అంటే కార్డియోపల్మనరీ రీససిటేషన్. గుండె ఆగిపోయిన వ్యక్తికి వెంటనే నేలపై వెల్లకిలా పడుకోబెట్టి గుండె పై భాగంలో పంపింగ్ చేస్తూ, అదే సమయంలో ఊపిరితిత్తులు ఆక్సిజన్ అందేలా చేయాలి అంటే నోట్లో నోరు పెట్టి ఊదుతూ గాలి అందించాలి. రెండు చేతులతో గుండె పై భాగంలో బలంగా అంటే వ్యక్తి వయస్సు, శరీర భాగాలకు డమేజ్ కాకుండా 30సార్లు నొక్కుతూ ఉండాలి. అదేవిధంగా శ్వాస అందిస్తూ ఉండాలి. అలాగే అంబులెన్స్ కి ఫోన్ చేసి హాస్పిటల్ కి వెళ్ళే వరకూ ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
హార్ట్ ఎటాక్ అంటే గుండెకు రక్త ప్రసరణను నిలిచిపోయి గుండె ఆగిపోతే దానిని హార్ట్ ఎటాక్ అంటారు. దీనికి ఎలాంటి సీపీఆర్ అవసరం లేదు. డాక్టర్ ని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. యాంజియోగ్రామ్, బైపాస్ సర్జరీ చేసి రక్త నాళాలను శుద్ధి చేసి రక్త ప్రసరణను సాఫిగా జరిగేలా చెయ్యాలి.