కరివేపాకు అని తీసి పాడేయకండి.. అది ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే అస్సలు వదలరు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

(ఈవార్తలు, రంగారెడ్డి ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)

కూరల్లో కరివేపాకు ఉండవలసిందే. రుచితో పాటు పోషకాలను అందించే కరివేపాకును ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు‌. ప్రతిరోజు ఏడు నుండి పది కరివేపాకులు తింటే జుట్టు రాలడం, జుట్టు నెరవడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే వెంట్రుకలు పెరగడానికి సహాయపడుతుంది.

ఎలా తీసుకోవాలి?

కరివేపాకులను నేరుగా తిని తరువాత కొన్ని నీళ్లు తాగాలి లేదంటే కప్పు నీళ్లలో కరివేపాకులు వేసి ఐదు నిమిషాలు మరిగించాలి తర్వాత కరివేపాకులను తీసివేసి వెచ్చగా ఉండగానే ఆ నీళ్లను తాగాలి. అలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. అంతేకాదు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కరివేపాకు ఔషధంలా పనిచేస్తుంది.

వికారం: ఈ సమస్య తగ్గాలంటే ఆరు కరివేపాకులను తీసుకొని శుభ్రంగా కడిగి ఎండబెట్టాలి తర్వాత వాటిని అర టి స్పూన్ నెయ్యి వేసి ఫ్రై చేయాలి చల్లారాక నమిలి తినాలి.

దుర్వాసన: ఐదు తాజా కరివేపాకులు తీసుకొని నీటిలో వేసుకోవాలి ఐదు నిమిషాలు నమాడాలి తర్వాత నీళ్లతో పుక్కిలించాలి దీనితో నోటి దుర్వాసన తగ్గుతుంది.

విరేచనాలు: 30 కరివేపాకులు తీసుకుని పేస్టులా రుబ్బి ఈ పేస్టును మజ్జిగలో కలుపుకొని తాగితే విరేచనాలు తగ్గుతాయి.

మధుమేహం: కరివేపాకులతో చట్నీ చేయాలి ఈ చెట్నీని అన్నం లేదా రోటితో తింటే మధుమేహం అదుపులో ఉంటుంది.

నోటిలో పుండ్లు: కరివేపాకు పొడిని తేనెతో కలిపి నోటిలోని పుండ్ల మీద రాయాలి ఇలా రెండు మూడు సార్లు రాస్తే ఉపశమనం కలుగుతుంది.

వెబ్ స్టోరీస్