అరటి పండ్లు: కేవలం 2 అరటి పండ్లు తింటే 90 నిమిషాల పాటు వ్యాయామం చేయగలిగే అంత శక్తి వస్తుంది. అరటి పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి శక్తిని ఇచ్చే కార్బొహైడ్రేట్లు, గుండెను పదిలంగా ఉంచే పొటాషియం అధికంగా లభిస్తాయి. సుమారు అరటి పండ్లలో 80 గ్రాముల పోషకాలు లభిస్తాయి.
ప్రతీకాత్మక చిత్రం

ఎనర్జీ 65 కిలో క్యాలరీలు
ప్రొటీన్: 1 గ్రాము
ఫ్యాట్: 0.1 శాతం
కార్బొహైడ్రేట్స్: 16.2 గ్రాములు
పొటాషియం: 264 మిల్లీ గ్రాములు
ఫైబర్: 1.1 గ్రాములు
యాపిల్స్: మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన వ్యాయామం, నిద్రతో పాటు, సరైన ఆహారం తీసుకోవడం కూడా ఎంతో అవసరం. మీ ఉదయాన్ని మరింత ఉత్సాహంగా ఉంచేందుకు కాఫీ కంటే ఎక్కువగా యాపిల్స్ పని చేస్తాయి. యాపిల్లో శరీరానికి కావలసిన గొప్ప సహజమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.
కీర దోసకాయలు: నిద్రపోయే ముందు కీర దోసకాయలు తింటే ఉదయం లేపేటప్పుడు ఎంతో రిఫ్రెష్‌గా ఉంటుంది, ఎలాంటి తలనొప్పి ఉండదు. ఎన్నో పోషకాలు ఉన్న ఈ దోసకాయ వల్ల శరీరంలోని విషతుల్యాలు తొలిగిపోవడంతో పాటు చెడు కొవ్వు తగ్గి బరువు కూడా అదుపులో ఉంటుంది. ఆరోగ్యంతో పాటు అందాన్ని పెంచడంలోనూ కూడా దిన్నీ ఎక్కువగా వాడుకోవచ్చు.
క్యారెట్లు:రోజు 3 క్యారెట్లు తింటే 3మైళ్ల దూరం పరిగెత్తే శక్తినిస్తా్యి. నిజం చెప్పాలంటే ఇవి మొదట ఔషధంగా ఉండేవి తర్వాత ఆహారంగా మారిపోయాయి. క్యారెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. క్యారెట్లో విటమిన్-A అధికంగా ఉంటుంది. దీనివల్ల కంటి చూపు మెరుగవుతుంది. క్యారెట్లో సోడియం రక్తపోటును నియంత్రిస్తుంది.