గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం పిండుకుని రోజూ తీసుకోవడం వల్ల ఊబకాయం,గుండె సమస్యలను కొంత వరకు నివారిస్తుందని అధ్యయనంలో తేలింది.
ప్రతీకాత్మక చిత్రం
సాధారణంగా, నిమ్మకాయలను వివిధ పూజలు,గృహ ప్రవేశం, వాహనం మొదలైన పూజలు, ఏదైనా శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. నిమ్మకాయల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. యూనివర్శిటీ ఆఫ్ లండన్‌కు చెందిన పోషకాహార నిపుణుడు ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో, ఒక వ్యక్తి నిమ్మకాయలను క్రమం తప్పకుండా తింటే, వారి రోగనిరోధక శక్తి మునుపటి కంటే బలంగా ఉంటుందని కనుగొన్నారు.
అంతే కాదు, రక్తహీనతను నయం చేస్తుంది, జీవశక్తిని పెంచుతుందని గుర్తించారు. అంతే కాకుండా గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం పిండుకుని రోజూ తీసుకోవడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. ఇది గుండె సమస్యలను కొంత వరకు నివారిస్తుందని తెలిపారు. కిడ్నీలో రాళ్లను నివారించే శక్తి కూడా నిమ్మకాయలో ఉంది.అంతేకాదు నిమ్మకాయ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
శరీరం వివిధ వైరల్ వ్యాధుల బారిన పడకుండా వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.అయితే నిమ్మరసం అవసరానికి మించి తీసుకోవడం మంచిది కాదు. దీనివల్ల గుండెల్లో మంట, వాంతులు, కడుపు ఉబ్బరం, జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు రోజులో గరిష్టంగా 2 నిమ్మకాయలు మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మన రోజువారీ ఆహారంలో నిమ్మకాయను చేర్చుకోవడం వల్ల మనల్ని అనేక రకాలుగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.