పెరుగులో అనేక రకాల పోషకాలు ఉన్నాయని మనందరికీ తెలిసిందే. దీన్ని డైట్‌లో చేర్చుకుంటే జీర్ణక్రియ సరిగ్గా సాగుతుంది. పెరుగులో కాల్షియం, విటమిన్ బి6, విటమిన్ బి12, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ప్రతీకాత్మక చిత్రం
పెరుగులో అనేక రకాల పోషకాలు ఉన్నాయని మనందరికీ తెలిసిందే. దీన్ని డైట్‌లో చేర్చుకుంటే జీర్ణక్రియ సరిగ్గా సాగుతుంది. పెరుగులో కాల్షియం, విటమిన్ బి6, విటమిన్ బి12, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. అంతేకాదు శరీరానికి కావాల్సినన్ని పోషకాలను కూడా అందిస్తుంది. ఎముకలను బలగంగా, ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. బరువును మెయింటైన్ చేయడంలో సహాయపడుతుంది. కానీ అధికంగా తింటే, అది బరువు పెరగడం, జీర్ణ సమస్యలు, లాక్టోస్ అసహనం కలిగిస్తుంది.
మధ్యాహ్నం భోజనం తర్వాత పెరుగు తినడం:
పెరుగు తింటే శరీరంలో ప్రోబయోటిక్స్ లభ్యమవుతాయి. ఇది పొట్టను ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.అంతేకాదు ఇందులోని పోషకాలు, ప్రోబయోటిక్ కంటెంట్ మొత్తం ఆరోగ్యానికి మంచిది. మధ్యాహ్న భోజనం తర్వాత పెరుగు తీసుకుంటే, అది శరీరానికి శక్తిని ఇవ్వడంతోపాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
కానీ రాత్రి భోజనం తర్వాత మాత్రం పెరుగు తినకూడదు. ఎందుకంటే ఇది నిద్ర, జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. మధ్యాహ్నం తర్వాత పెరుగు తినడం వల్ల కలిగే 5 ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైన జీర్ణక్రియ:
పెరుగులో విటమిన్లు, ప్రొటీన్లు, లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఉన్నాయి. ఇవి ఇమ్యూనిటినీ పెంచుతాయి. ఇందులోని ప్రోబయోటిక్ కంటెంట్ గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, వ్యాధిని కలిగించే వ్యాధికారక క్రిములతో పోరాడటానికి సహాయపడుతుంది.
రక్తంలో చక్కెర నియంత్రణ:
పెరుగులో జీర్ణమయ్యే ప్రోటీన్ కంటెంట్ కారణంగా, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. పెరుగు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుతుంది.
బరువు నిర్వహణ కోసం:
పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉండటంతో కార్టిసాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. పెరుగు తీసుకుంటే, అది కార్టిసాల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. సరికాని జీవనశైలి కారణంగా కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తికి దారితీస్తుంది. ఇది నడుము ప్రాంతంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణం అవుతుంది.
గుండె ఆరోగ్యం కోసం:
పెరుగు తీసుకుంటే, అది కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా ఇది రక్తపోటును కూడా కంట్రోల్లో ఉంచుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గితే గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
మధ్యాహ్న భోజనం తర్వాత పెరుగు తినడం మంచిదా?
కడుపు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి మధ్యాహ్న భోజనం తర్వాత పెరుగు తీసుకోవడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ప్రోబయోటిక్ కంటెంట్ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.అంతేకాదు వేసవిలో ఇది శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది.పెరుగులో ఉండే కాల్షియం, ప్రొటీన్లు శరీరానికి సహాయపడుతుంది. మీకు లాక్టోస్ అలెర్జీ కలిగిస్తే..మీరు పెరుగును తినకూడదు.