ఆరు నుంచి ఏడు గంటల పాటు నీళ్లలో నానబెట్టిన అంజీర పండ్లను తింటే ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.
ప్రతీకాత్మక చిత్రం
అంజీర్ పండు దాని రుచికి, పోషకాలకు పెట్టింది పేరు. అంజూర పండు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒకప్పుడు రోడ్లకు ఇరువైపులా ఎక్కడపడితే అక్కడ అంజూర చెట్లు ఉండేవి. కానీ ఇప్పుడు పట్టణీకరణ, రోడ్ల విస్తరణ కారణంగా ఈ చెట్లు అరుదైపోయాయి. ఫలితంగా తాజా అంజూర పండ్లను కూడా మార్కెట్‌లో తరచుగా అందుబాటులో ఉండడం లేదు. అయితే ఇప్పుడు ఎండు అంజూర పండ్లను డ్రైఫ్రూట్స్‌గా మార్కెట్‌లో దొరుకుతుంది. ఎండిన అంజూర పండ్లకు కూడా మంచి రుచి ఉంటుంది. కానీ వాటిని రాత్రంతా నానబెట్టడం వల్ల వాటి పోషక విలువలు పెరుగుతాయి. ఇవి మీ ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరంగా ఉంటాయి.
ఎండు అంజూర పండ్లలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, విటమిన్ బి6, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి సీజన్‌తో సంబంధం లేకుండా, ప్రతిరోజూ ఒక నానబెట్టిన అంజూరాన్ని తినడం వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చు, దాని గురించి తెలుసుకుందాం.
ఆరు నుంచి ఏడు గంటల పాటు నీళ్లలో నానబెట్టిన అంజీర పండ్లను తింటే ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.
ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది :
నానబెట్టిన అంజూర పండ్లలో డైటరీ ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి అవసరం. ఫైబర్ ప్రేగు పనితీరును సక్రియం చేయడంలో సహాయపడుతుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :
అంజూర పండ్లలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది , గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి మీ రోజువారీ ఆహారంలో నానబెట్టిన అంజూర పండ్లను చేర్చుకోవడం ద్వారా, మీరు అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది, అలాగే హృదయనాళ పనితీరును మెరుగుపరుస్తుంది.