ఉదయాన్నే కాలి కడుపుతో వేడి నీటిని తాగితే ఏం అవుతుందంటే..

నీరు మనకి ప్రకృతి ప్రసాదించిన వరం. జలమే జీవం. నీరు అద్భుతమైనది, అమూల్యమైనది. నీరు లేకుండా ఈ భూమి మీద ఏ జీవరాశులూ బతకలేవు. అయితే.. ఉదయాన్నే కాలి కడుపుతో నీళ్లు తాగితే మంచిదని పెద్దలు చెప్తుంటారు.

HOT WATER

ప్రతీకాత్మక చిత్రం

నీరు మనకి ప్రకృతి ప్రసాదించిన వరం. జలమే జీవం. నీరు అద్భుతమైనది, అమూల్యమైనది. నీరు లేకుండా ఈ భూమి మీద ఏ జీవరాశులూ బతకలేవు. అయితే.. ఉదయాన్నే కాలి కడుపుతో నీళ్లు తాగితే మంచిదని పెద్దలు చెప్తుంటారు. అయితే ఆయుర్వేద నిపుణలు వేడి నీళ్లు తాగాలని సూచిస్తుంటారు. మరి వేడి నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఉదయాన్నే వేడి నీటిని తీసుకోవడం వల్ల మన జీర్ణక్రియను సక్రమంగా పనిచేయటంలో సహయపడుతుంది. కడుపులో పెద్ద పేగు శుభ్రపడి మరింతగా పోషకాలు గ్రహిస్తుంది. దీనితో జీర్ణవ్యవస్థ మెరుగుపడి ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. మన శరీరంలోని ఉష్ణోగ్రత పెరగటానికి దోహద పడుతుంది.

ఈ వేడి నీళ్లు శరీరంలోని క్యాలరీలను బర్న్ చేయాటానికి సహయపడుతాయి. తద్వారా బరువు తగ్గుతుంది. రక్తంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది.  గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటి వాటినీ నివారించుకోవటానికి కూడా ఈ వేడి నీటిని తీసుకోవడం చక్కని పరిష్కారం. శ్వాస సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. శ్వాస అన్ని అవయవాలకు సమపాళ్ల లో అంది శరీరం  ఆరోగ్యంగా ఉంటుంది.  వేడి నీటిని ఉదయాన్నే తీసుకోవడం వల్ల మలిన పదార్థాల విసర్జన సాఫీగా జరుగుతుంది. శరీరం తేలికై రోజంతా హుషారుగా ఉంటుంది. మల బద్దకం నివారణకు ప్రతి రోజు ఉదయాన్నే వేడి నీటిని తాగటం ఒక చక్కటి పరిష్కారం.

శరీర సమతుల్యతను పెంచడానికి నీరు మనకు చాలా ఉపయోగపడుతుంది. పరగడుపున నీటిని తీసుకోవడం వలన మనకి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఆ నీటిని వేడి చేసి తీసుకోవడం వల్ల  మీ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. నీటిని వేడి చేయడం వల్ల నీటిలోని మన కంటికి కనిపించని బ్యాక్టీరియా చనిపోయి నీరు శుభ్రం అవుతుంది. ఆ వేడి నీరు నేచురల్ మెడిసిన్‌గా పనిచేస్తుంది. చర్మంపై ముడతలు తగ్గి చర్మం కాంతివంతంగా కనిపించాలంటే ప్రతి రోజు వేడి నీరు తాగాలి.

వేడి నీళ్లు తాగిన తర్వాత మన శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి శరీరానికి చెమటలు పడతాయి. ఆ చెమట రూపంలో చర్మంలోని మలినాలు అన్నీ బయటకు పోయి చర్మం శుభ్రపరుతుంది. రక్త కణాలు కూడా శుభ్రపడుతాయి. మన శరీరం 70 శాతం నీటిని కలిగి ఉంటుంది. మనం నిద్రపోయాక మన శరీరంలోని నీటి శాతం తగ్గే అవకాశం ఉంటుంది. కాబాట్టి ఉదయాన్నే నీటిని తీసుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు. అంతేకాకుండా శరీరంలోని క్రిములను తొలిగించడంలో ఈ వేడి నీరు ఉపయోగపడుతుంది. మనం తినే ఆహారం జీర్ణం అవ్వటానికి తగినంత ఉష్ణోగ్రత అవసరం. వేడి నీరు తీసుకోవటం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి ఆహారం జీర్ణం అవుతుంది. ఈ వేడి నీరు పోషకాలను శరీరానికి పూర్తి స్తాయిలో అందించడంలో దొహదపడుతాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్