పోపులో జీలకర్ర ఉంటేనే అందం. జీలకర్ర నీళ్లు, జీలకర్ర ఉప్పు కలిపి తింటే కడుపు ఉబ్బరం, అజీర్తీ పరార్ అవుతాయి. పోపులపెట్టెలో అగ్రతాంబూలం అందుకున్న జీలకర్రలో ఎన్నో రకాలు ఉన్నాయి.
జీలకర్రలో ఆరోగ్య పోషకాలు మెండుగా ఉన్నాయి. దీన్ని మించిన ఔషధి నల్ల జీలకర్ర. ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో నల్ల జీలకర్రను ఎక్కువగా వాడుతుంటారు. అనేక రుగ్మతలను నయం చేసే నల్ల జీలకర్ర ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణవ్యవస్థ:
నల్ల జీలకర్రను చేదు జీలకర్ర అని కూడా పిలుస్తుంటారు. మూత్రపిండాలు, లివర్, గుండె, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఇది ఔషధంగా పనిచేస్తుంది.
కొవ్వును కరిగించడంలో:
శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడంలో నల్లజీలకర్ర ఎంతో మేలు చేస్తుంది. బీపీని కంట్రోల్ చేయడంతోపాటు చర్మవ్యాధులను కూడా అరికడుతుంది.
దగ్గు, జలుబు:
జీలకర్రలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరస్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. శరీరంలో ఉండే వాపులను తగ్గించడంలో, దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
సీజనల్ వ్యాధులు:
నల్ల జీలకర్ర కషాయం తాగితే సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. దీన్ని తయారు చేయడం చాలా ఈజీ ప్రక్రియ. ఒక గ్లాసు నీరు తీసుకుని అందులో ఒక టీ స్పూన్ నల్ల జీలకర్రను వేసి అర గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి. దానిని వడకట్టుకుని పరగడుపున తాగితే దీర్ఘకాలిక రోగాల బారినపడకుండా ఉంటవచ్చు. దీనిని పొడిని తేనె కలుపుకుని తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.