Avacado Benefits : సోషల్ మీడియాలో ఈ మధ్య అవకాడో పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అమెరికన్లకు అత్యంత ప్రీతికరమైన పండు. అవకాడలో విటమిన్లు, మినరల్స్, ప్రోటిన్స్ పుష్కటంగా ఉన్నాయి. ఇది రుచికరమైన పండు. ఆరోగ్యాన్ని కాపాడటంలో అవకాడోను మించిన పండు లేదు.
ప్రతీకాత్మక చిత్రం
సోషల్ మీడియాలో ఈ మధ్య అవకాడో పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అమెరికన్లకు అత్యంత ప్రీతికరమైన పండు. అవకాడలో విటమిన్లు, మినరల్స్, ప్రోటిన్స్ పుష్కటంగా ఉన్నాయి. ఇది రుచికరమైన పండు. ఆరోగ్యాన్ని కాపాడటంలో అవకాడోను మించిన పండు లేదు. అవకాడోలో ఉండే ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. శరీరానికి కావాలసిన పొటాషియం అవకాడోలో ఉంటుంది. చాలామంది పొటాషియం పుష్కలంగా దొరికే పండు అరటిపండు అని అనుకుంటారు. కానీ అవకాడోలో పొటాషియంలో పాటు పోషకాలు అనేకం ఉన్నాయి. కళ్లను సంరక్షించుకోవడానికి అవకాడో బాగా పనిచేస్తుంది. అంధత్వ నివారణకు అవకాడోను మించిన ఔషదం లేదనే చెప్పాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి అవకాడోను తినాలని వైద్యులు చెబుతున్నారు. అవకాడోలో శరీరానికి ఉపయోగపడే మంచి కొవ్వు ఉంటుంది. పుట్టుకతో వచ్చే లోపాలు అధిగమించడానికి అవకాడో తినాలని అంటున్నారు. గర్భం దాల్చిన వెంటనే అవకాడో తినటం ప్రారంభిస్తే మంచిదని చెబుతున్నారు.
ఒక 100 గ్రాముల అవకాడోలో 150 క్యాలరీలు ఉంటాయి. ఇందులో క్యాలరీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఫ్యాట్‌కు సంబంధించిన కంటెంట్ కూడా ఎక్కుగానే ఉంటుంది. ఈ ఫ్యాట్ అనేది చెడు ఫ్యాట్ కాకుండా మన శరీరానికి కావలసిన మోనో అన్ సాచ్యురేట్ ఫ్యాటీ యాసిడ్స్ అవకాడోలో ఉంటుంది. ఇది మన గుండెకు చాలా మంచిది. ఒక అవకాడో మూడు కోడిగుడ్లలో దొరికే ప్రోటిన్ అంటే మూడు మిల్లీగ్రాముల ప్రోటిన్ అవకాడోలో ఉంటుంది. సాధారణంగా పండ్లలో ఎక్కువగా ప్రోటిన్ అనేది ఉండదు. చాలా తక్కువ పండ్లలో ఉంటుంది. కానీ అవకాడోలో మంచి ఎనర్జీ, క్యాలరీస్, ప్రోటీన్స్, మంచి క్యాలరీల ఫ్యాట్ బాగా లభిస్తాయి. అలాగే ఇందులో మంచి మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి. మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ మన శరీరానికి యాంటీ ఆక్సిడెంట్స్‌లా పనిచేస్తాయి. ముఖ్యంగా పొటాషియం మినరల్ అనేది అవకాడోలో చాలా బాగా లభిస్తుంది. ఇది మన బ్లడ్ ప్రెజర్‌ను బాగా కంట్రోల్ చేస్తుంది. అవకాడోలో మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఐరన్, జింక్ లాంటివి అధికంగా ఉంటాయి.
అవకాడో తినడం వల్ల ఉపయోగాలు:
అవకాడో తినడం వల్ల సౌందర్యాన్ని పెంచుకోవచ్చు.ముఖ్యంగా పొడిబారిన చర్మం ఉన్న వారికి ఇది ఒక దివ్య ఔషధం.
ఇది అద్భుతమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. అందుకు చేయావల్సిందల్లా అవకాడోను సగభాగానికి కట్ చేసి ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
అవకాడో బరువుని తగ్గిస్తుంది.
బ్రెయిన్ ట్యూమర్ నుంచి కాపాడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది.
కంటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది.
క్యాన్సర్లను నివారిస్తుంది.
చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది.
రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
