కాకరకాయతో జుట్టు సమస్యలకు చెక్..!

కాకరకాయ తినాలంటే చాలా మంది ఇష్టపడరు. ఎందుకంటే చేదుగా ఉంటుంది. కానీ అందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాకరకాయ ఆరోగ్యానికి మాత్రమే కాదు..మన కురులకు కూడా మేలు చేస్తుంది.

HAIR CARE TIPS

ప్రతీకాత్మక చిత్రం 

కాకరకాయతో చేసిన వంటకాలు తినేందుకు చాలా మంది ఇష్టపడరు. చేదుగా ఉంటుందని తినేందుకు విముక్తి చూపిస్తుంటారు. అయితే కాకరకాయతో మనము ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కాకరకాయ వల్ల కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు..మన కురులకు అందాన్నిస్తుంది. కాకరరసం తరచూ జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. వెంట్రుకలు కూడా ద్రుఢంగా ఉంటాయి. అలాగే దీనిలో యాంటీమైక్రోబియల్ గుణాల వల్ల చుండ్రు, తలలో వచ్చే ఇతర ఇన్ఫెక్షన్లు దరిచేరవు. ఈ ప్రయోజనాలను పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. 

ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కాకరరసాన్ని ఉపయోగిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. దీనికోసం అరకప్పు కాకరకాయ రసాన్ని తీసుకుని దానిలో చెంచా కొబ్బరి నూనెను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. మాడుకు కూడా రాసి 5 నుంచి 10 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత 30 నుంచి 40 నిమిషాలపాటు ఆరనివ్వాలి. అనంతరం గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు అప్లయ్ చేసుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. 

మనం ఉపయోగించే కొన్ని హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ రసాయనాలు, బయట కాలుష్యం కారణంగా జుట్టు చివర్ల చిట్లడం సాధారణ సమస్యగా మారింది. అంతేకాదు మనం తలస్నానం చేసే విధానం కూడా ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. దీన్ని  నివారించేందుకు సరిపడినంత కాకర రసాన్ని తీసుకుని కురులకు పట్టించాలి. 40 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. ఇలా వారానికి 2సార్లు చేస్తే మూడు వారాల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. 





సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్