దేశంలో షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ప్రపంచంలో అత్యధిక షుగర్ వ్యాధిగ్రస్తులు భారత్ లోనే ఉన్నారు. షుగర్ వ్యాధితో బాధపడే వారంతా అనేక కోరికలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి. ఇటువంటి సమస్యలకు ఉపశమనం కలిగించేలా ఇన్సులిన్ అభివృద్ధి చేశారు.
ఇన్సులిన్ తీసుకుంటున్న వైనం
దేశంలో షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ప్రపంచంలో అత్యధిక షుగర్ వ్యాధిగ్రస్తులు భారత్ లోనే ఉన్నారు. షుగర్ వ్యాధితో బాధపడే వారంతా అనేక కోరికలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి. ఇటువంటి సమస్యలకు ఉపశమనం కలిగించేలా ఇన్సులిన్ అభివృద్ధి చేశారు. డెన్మార్క్, యూకే దేశాలకు చెందిన ఫార్మా సంస్థలు శాస్త్రవేత్తలు మానవ ఇన్సులిన్ హార్మోన్ లోని బి29 (మైక్రో సైకిల్) ప్రాంతాన్ని, బీ1 (గ్లూకోసైడ్) ప్రాంతాన్ని మార్చడం ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలకు అనుగుణంగా పనిచేసే ఇన్సులిన్ సంయోజకాన్ని తయారు చేశారు. దానికి ఎన్ఎన్సీ 2215 అనే పేరు పెట్టారు. ఈ స్మార్ట్ ఇన్సులిన్ లోని మాక్రో సైకిల్ భాగం రంగు ఆకారంలో ఉంటుంది. గ్లూకోసైడ్ మాలిక్యుల్ గ్లూకోజ్ తరహాలో ఇది ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలో పడిపోయినప్పుడు గ్లూకో సైడ్ మాలిక్యుల్ వెళ్లే రింగ్ భాగానికి అతుక్కుంటుంది. అప్పుడు ఇన్సులిన్ పనిచేయడం మానేస్తోంది. దీనివల్ల చక్కెర స్థాయిలో తగ్గడం ఆగుతుంది. అదే రక్తంలో చక్కెర స్థాయిలో ఎక్కువగా ఉన్నప్పుడు.. గ్లూకోసైడ్ స్థానాన్ని గ్లూకోజ్ భర్తీ చేస్తుంది. వెంటనే తగిన మోతాదులో ఇన్సులిన్ పనిచేస్తుంది.
షుగర్ లెవెల్స్ సురక్షిత స్థాయిలకు చేరుకుంటాయి. అయితే ఇదంతా ప్రస్తుతానికి ప్రయోగ దశలో ఉంది. కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. మనుషులపై పరీక్షలు పూర్తయి మార్కెట్లోకి అందుబాటులోకి రావడానికి మరి కొంతకాలం పడుతుంది. హ్యూమన్ ట్రైల్స్ కూడా విజయవంతం అవుతాయని ఈ స్మార్ట్ ఇన్సులిన్ కూడా శరీరంలోని సహజ ఇన్సులిన్ అంత సమర్థంగా పనిచేస్తుందని దీని రూపకర్తలు చెబుతున్నారు. సాధారణంగా ఇన్సులిన్ మోతాదు ఎక్కువ తక్కువ అయితే దానివల్ల వేరే దుష్ప్రభావాలు ఉంటాయి. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు, రోజువారి రొటీన్ గా ఇన్సులిన్ తీసుకుంటే చక్కెర స్థాయిలో మరింతగా పడిపోయి హైపోగ్లసిమియాకు దారి తీయొచ్చు. కొన్ని సందర్భాల్లో అది ప్రాణాంతకం కూడా అవుతుంది. అందుకే షుగర్ లెవెల్స్ ఆధారంగా తగిన మోతాదులో ఇన్సులిన్ విడుదల అయ్యే, విడుదల చేసే పరిజ్ఞానంపై 1970 నుంచి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే డెన్మార్క్ యూకే దేశాలకు చెందిన పలు ఫార్మా సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలు సత్ఫలితాన్ని ఇస్తున్నాయి. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది షుగర్ బాధితులకు మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.