డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు శుభవార్త.. కొత్తరకం బియ్యంతో వ్యాధిగ్రస్తులకు మేలు

అధిక బరువు, జీన్స్ వంటి అంశాలు ఈ దీర్ఘకాలిక వ్యాధికి కారణం అవుతున్నాయి. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి చేయడంలో విఫలమైనప్పుడు టైప్-2డయాబెటిస్ వస్తుంది. కణాలు ఇన్సులిన్ నిరోధకతకు అభివృద్ధి చేస్తాయి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) అధికంగా ఉంటే డయాబెటిస్ వస్తుంది. దీన్ని అదుపు చేసేందుకు 45 కంటే తక్కువ జిఐ ఉన్న వరి రకాన్ని అభివృద్ధి చేశారు

Rice with a low glycemic index

గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న బియ్యం

ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ తో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. భారత్ అయితే డయాబెటిస్ కేంద్రంగా మారుతోందన్న గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు తీపి కబురు అందింది. ప్రపంచ వ్యాప్తంగా 537 మిలియన్లకుపైగా పెద్దలు మధుమేహంతో బాధపడుతుండగా 2045 నాటికి ఈ సంఖ్య 783 మిలియన్లకు పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆర్గనైజేషన్ వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధిక బరువు, జీన్స్ వంటి అంశాలు ఈ దీర్ఘకాలిక వ్యాధికి కారణం అవుతున్నాయి. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి చేయడంలో విఫలమైనప్పుడు టైప్-2డయాబెటిస్ వస్తుంది. కణాలు ఇన్సులిన్ నిరోధకతకు అభివృద్ధి చేస్తాయి  రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) అధికంగా ఉంటే డయాబెటిస్ వస్తుంది. దీన్ని అదుపు చేసేందుకు 45 కంటే తక్కువ జిఐ ఉన్న వరి రకాన్ని అభివృద్ధి చేశారు అంతర్జాతీయ వారి పరిశోధన శాస్త్రవేత్తలు. దీనివలన షుగర్ వ్యాధి బాధితులకు ఎంతో మేలు చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) లక్షణాలతో కూడిన ఈ బియ్యం డయాబెటిక్, ఫ్రీ డయాబెటిక్ ఉన్నవారికి వరంగా మారనుంది. ఈ ఈ బియ్యంతో చేసిన అన్నాన్ని తినడం ద్వారా మధుమేహాన్ని కంట్రోల్ చేసేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణ బియ్యం రకాలను తక్కువ జిఐ బియ్యంగా మార్చడం ద్వారా దీన్ని డెవలప్ చేశారు. ఐఆర్ఆర్ఐ ఇప్పటికే ఫిలిప్పీన్స్ లో ఐఆర్ఆర్ఐ 125, ఐఆర్ఆర్ఐ 147 అనే రెండు తక్కువ (జిఐ) వరి రకాలను విడుదల చేసింది. బియ్యం ప్రధానమైన ఆహారంగా తీసుకునే దేశాల్లో పేదరికం, ఆకలని ఎదుర్కోవడానికి ఐఆర్ఆర్ఐ రెమిట్ లో భాగంగా భారతదేశం ఫిలిప్పీన్స్ లో దీనిని పెంచడం ప్రారంభించాలని యోచిస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆసియా, ఆఫ్రికా ఖండాలలో బియ్యం తినే దేశాల్లో ఈ బియ్యం పెద్ద ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఈ రకం బియ్యంతో డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు మేలు చేకూరుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. వీలైనంత తక్కువ వ్యవధిలోనే ఈ బియ్యాన్ని మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదే జరిగితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు కలుగనుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్