సనాతన ధర్మం ప్రకారం మనిషి ఆరోగ్యానికి దివ్యౌషధాలు ఇవే.. అన్నీ ఉచితం

సనాతన ధర్మం ప్రపంచానికి పాఠాలు నేర్పింది. ఎలా ఉండాలి? ఎలా బతకాలి? ఎలా బతకకూడదు? అన్న ప్రతి అంశాన్ని నిర్వచించింది. భారతీయ సంస్కృతిలో భాగమైన సనాతన ధర్మం.. ప్రపంచానికి వెలుగును ప్రసాదించింది.

sanatana dharma

ప్రతీకాత్మక చిత్రం

సనాతన ధర్మం ప్రపంచానికి పాఠాలు నేర్పింది. ఎలా ఉండాలి? ఎలా బతకాలి? ఎలా బతకకూడదు? అన్న ప్రతి అంశాన్ని నిర్వచించింది. భారతీయ సంస్కృతిలో భాగమైన సనాతన ధర్మం.. ప్రపంచానికి వెలుగును ప్రసాదించింది. ఆరోగ్య విషయాలు మొదలు.. చేయాల్సిన పనులు, చేయకూడని పనులు.. లాభనష్టాలు.. కుటుంబం.. ఆధ్యాత్మిక చింతన.. ఇలా ప్రతి అంశంలో ప్రతి మనిషికి అవసరమైన గుణగణాలను సూచించింది. అయితే.. ఆరోగ్యపరంగా మనిషి ఎలా ఉండాలి? ఏం చేస్తే దీర్ఘాయువు దక్కుతుంది? ఎలాంటి పనుల వల్ల ఆరోగ్యకరమైన జీవితం అందుతుంది? అన్న ప్రశ్నలకు సమాధానాలు అందజేసింది.

ఆ దివ్యౌషధాలు ఇవే..

  • బ్రహ్మ ముహూర్తంలో లేవడం ఒక ఔషధం
  • సూర్య నమస్కారం చేయటం ఒక ఔషధం
  • నిత్య అగ్నిహోత్రం ఒక ఔషధం
  • ప్రాణాయమం ఔషధం
  • ధ్యానం ఔషధం
  • ఉదయం/సాయంత్రం నడక ఔషధం
  • ఉపవాసం ఔషధం
  • కుటుంబంతో కలిసి భోజనం చేయడం ఔషధం
  • నవ్వు, హాస్యం కూడా ఔషధం
  • గాఢ నిద్ర ఔషధం
  • అందరితో కలిసిమెలిసి మెలగడం ఔషధం
  • సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోవడం ఔషధం
  • మనస్సులో సానుకూలత  ఔషధం
  • ఆధ్యాత్మిక జీవనం ఔషధం
  • అందరికీ మంచి జరగాలని కోరుకోవడం ఔషధం
  • ఇతరుల కొరకు ప్రార్థించడం ఔషధం
  • అలింగనం ఒక ఔషధం
  • పరోపకారం దివ్య ఔషధం
  • మనసుకు నచ్చిన వారితో ముచ్చట్లు దివ్య ఔషధం
  • ఆత్మీయులను తలుచుకోవడం ఒక ఔషధం
  • కొన్నిసార్లు, నిశ్శబ్దం ఔషధం
  • ప్రేమ ఇతరులకు పంచడం ఔషధం
  • ఇక చాలు అని తృప్తి చెందడం ఔషధం

సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్