చాలా మంది తల్లులకు ఉన్న ప్రశ్న ఏంటి అంటే, పిల్లలకు జలుబు దగ్గు ఉన్నప్పుడు అరటిపండు తినిపించవచ్చా లేదా అని. మరీ తినిపించాలా లేదా అనే విషయం తెలుసుకుందాం.
ప్రతీకాత్మక చిత్రం
చాలా మంది తల్లులకు ఉన్న ప్రశ్న ఏంటి అంటే, పిల్లలకు జలుబు దగ్గు ఉన్నప్పుడు అరటిపండు తినిపించవచ్చా లేదా అని. మరి తినిపించవచ్చా? లేదా? అనే విషయం తెలుసుకుందాం. అన్ని పండ్లతో పోల్చుకుంటే అరటి పండు అనేది చాలా మంచి పండు. అది 6 నెలల నుండే బేబీకి పెట్టవచ్చు. ఇది తొందరగా జీర్ణం అవుతుంది. అరటి పండు తినిపించడం వల్ల మలబద్ధకం సమస్య ఉండదు. అలాగే కంటి చూపు మెరుగు అవుతుంది. ఎముకలు ధృడంగా మారుతాయి. జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. తక్షణ శక్తిని ఇస్తుంది. పిల్లలు బరువు పెరగటంలో కూడా దీని ప్రధాన పాత్ర ఉంది. అరటి పండ్లలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బీ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఉండటం వల్ల అరటిపండు పిల్లలకు తినిపిస్తే పిల్లల ఎదుగుదల సక్రమంగా ఉంటుంది.
అరటి పండు తినటం వల్ల జలుబు, దగ్గు లాంటివి వస్తాయని పిల్లలకు చాలా మంది అరటి పండు తినిపించరు. అయితే, అది చాలా మంది తల్లులు చేసే తప్పు. అరటి పండు తినడం వల్ల ఎలాంటి జలుబు, దగ్గు, జ్వరం లాంటివి రావు. అరటి పండులో ఇమ్యూనిటీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల పిల్లలకు అరటి పండు తినిపించడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.
