ఆహారానికి రుచిని జోడించే కరివేపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిత్యం తీసుకునే ఆహారంలో ఉండే కరివేపాకుని తీసి పక్కన పెడుతుంటారు. కానీ కరివేపాకులోని హెల్త్ బెనిఫిట్స్ తెలుస్తే అస్సలు వదిలిపెట్టరు. ప్రతిరోజూ ఉదయాన్నే 7-8 కరివేపాకులు తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
కరివేపాకు
ఔషద గుణాలున్న కరివేపాకును పారేయకుండా తింటే మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే, మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా.. ఫిట్‌గా ఉంచుకోవాలంటే..ప్రతిరోజూ రోజుకు 7-8 కరివేపాకులను ఖాళీ కడుపుతో తినడం అలవాటు చేసుకోండి. ప్రతిరోజూ కరివేపాకు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఊబకాయం: కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగిపోయి ఎదుగుదల ఉత్తేజితమై శరీర బరువు తగ్గుతుంది.
బ్లడ్ షుగర్ లెవెల్: డయాబెటిక్ పేషెంట్లు ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకును తింటే.. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
కంటి ఆరోగ్యం: కరివేపాకులో విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని బీటా కెరోటిన్ క్యాటరాక్ట్, ఇతర కంటి సమస్యలను నివారిస్తుంది.
కొలెస్ట్రాల్ తగ్గుతుంది: కరివేపాకును ఖాళీ కడుపుతో తింటే చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. దీంతో గుండె సంబంధిత వ్యాధులను తగ్గించుకోవచ్చు.
చర్మ ఆరోగ్యం: కరివేపాకులోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. ఇది వృద్ధాప్యాన్ని నివారించడంతోపాటు.. ముడతలు, ఇతర చర్మ సమస్యలను నయం చేస్తుంది.
జుట్టు ఆరోగ్యం: కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుదలకు మేలు చేస్తాయి. అంతేకాదు నెరిసిన జుట్టు, బట్టతల వంటి సమస్యలను చాలా వరకు తగ్గిస్తుంది.