గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం.. నియంత్రణలోనే బిపి, ఈ ఆహారాన్ని మీరు ట్రై చేయండి

బీపీని కంట్రోల్ లో ఉంచుకోవడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని పెంచుకునేందుకు అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. బీపీ అధికంగా ఉంటే అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. బీపీని సైలెంట్ కిల్లర్ అని కూడా పేర్కొంటారు. హై బీపీ వల్ల ప్రాణాలు పోతాయి. ఈ సమస్యకు ఆరోగ్యమైన ఫుడ్ తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం, మద్యం అధికంగా తీసుకోవడం వంటివి కారణాలుగా ఉంటున్నాయి. మధుమేహం, మూత్రపిండ వ్యాధులు, నిద్ర సంబంధిత సమస్యలు, ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Heart attack

గుండె పోటు

ఈ మధ్యకాలంలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. బిపి కూడా యుక్త వయసులు వారిని తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా బీపీని కంట్రోల్ లో ఉంచుకోవడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని పెంచుకునేందుకు అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. బీపీ అధికంగా ఉంటే అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. బీపీని సైలెంట్ కిల్లర్ అని కూడా పేర్కొంటారు. హై బీపీ వల్ల ప్రాణాలు పోతాయి. ఈ సమస్యకు ఆరోగ్యమైన ఫుడ్ తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం, మద్యం అధికంగా తీసుకోవడం వంటివి కారణాలుగా ఉంటున్నాయి. మధుమేహం, మూత్రపిండ వ్యాధులు, నిద్ర సంబంధిత సమస్యలు, ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. డిపిని నియంత్రణలో ఉంచుకోలేకపోతే గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధులు వేధిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే బీపీని కంట్రోల్ చేయడం చాలా ముఖ్యంగా నిపుణులు పేర్కొంటున్నారు. అధిక రక్తపోటును కొన్ని రకాల మందులతో నియంత్రణలో ఉంచుకోవడంతోపాటు ఆహారపు అలవాట్లు కూడా బాగా ఉపకరిస్తాయి. రోజువారి ఆహారంలో కొన్ని ఆహారపు అలవాటులను చేర్చుకోవడం ద్వారా రక్తపోటును కంట్రోల్లో ఉంచడంతోపాటు గుండు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందుకోసం తప్పనిసరిగా ఫైబర్, పొటాషియం అధికంగా ఉండే పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. 

బీపీని నియంత్రణలో ఉంచేందుకు పండ్లు, కూరగాయలు ఎంతగానో దోహదం చేస్తాయి. వీటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ బరువును కంట్రోల్ చేయడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బచ్చలి కూర వంటి ఆకుకూరల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. బెర్రీలు, అరటి పండ్లు, నారింజలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతగానో ఉపకరిస్తాయి. వీటితోపాటు క్వినోవా, బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాలను డైట్లో చేర్చుకోవడం చాలా మంచిది. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి రక్తనాళాల పనితీరును మెరుగుపరిచి, కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. వీటిలో బీ విటమిన్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి హార్ట్ ఆరోగ్యాన్ని ప్రమోట్ చేయడంతో పాటు రక్తపోటును కంట్రోల్ చేస్తాయి. అలాగే స్కిన్లెస్ పౌల్ట్రీ, చేపలు, బీన్స్ వంటి కాయ దాన్యాలు బీపిని నియంత్రణలో ఉంచడంలో దోహదం చేస్తాయి. వీటివల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. సాల్మన్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి రక్తపోటును కంట్రోల్ చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకంగా వ్యవహరిస్తాయి.

బాదం, వాల్ నట్స్, అవిసే గింజలు, సోయా సీడ్స్ వంటి వాటిల్లో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. వీటిలో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించే రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి. వీటివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బీన్సు, చిక్ పీస్, కాయ దాన్యాల్లో డైటరీ ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం వంటి అవసరమైన పోషకాలు ఉంటాయి. ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. రక్తనాళాల పనితీరును మెరుగుపరిచి బీపీని కంట్రోల్ చేస్తుంది వీటిలోని ఫ్యాట్ గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. అలాగే వెల్లుల్లి, తులసి, కొత్తిమీర వంటి మూలికలను డైట్ లో చేర్చుకోవచ్చు. ఉప్పును ఎక్కువగా వేసుకోకుండా రుచిని వీటీతో పెంచుకోవచ్చు. వెల్లుల్లిలో యాంటీ హైపర్టెన్సీవ్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తాయి. వీటితో సోడియం తగ్గించుకోవచ్చు ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి వీటిని రోజువారి ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బీపీని నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఈ జాగ్రత్తలను పాటించడం చాలా వరకు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్