Mosquito : దోమలు కుట్టకుండా ఉండేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి

జోరుగా వానలు పడుతున్నాయి. ఎక్కడో ఓ చోట నీళ్లు నిలబడినా..అందులో దోమలు నివాసం ఏర్పరుచుకుంటాయి. అవి కాస్తా మన ఇంటిని చుట్టుముడుతుంటాయి. దాంతో జ్వరాల బారినపడటం తప్పదు.అలాని మస్కిటో రెపెల్లెంట్స్, మస్కిటో మ్యాట్స్ వాడితే వాటి రసాయనాల వల్ల మన ఆరోగ్యానికి హానికరం. అలా కాకుండా ఈ సహజ చిట్కాలు పాటించి దోమలకు చెక్ పెట్టండి.

mosquito bites

ప్రతీకాత్మక చిత్రం 

జోరుగా వానలు పడుతున్నాయి. ఎక్కడో ఓ చోట నీళ్లు నిలబడినా..అందులో దోమలు నివాసం ఏర్పరుచుకుంటాయి. అవి కాస్తా మన ఇంటిని చుట్టుముడుతుంటాయి. దాంతో జ్వరాల బారినపడటం తప్పదు.అలాని మస్కిటో రెపెల్లెంట్స్, మస్కిటో మ్యాట్స్ వాడితే వాటి రసాయనాల వల్ల మన ఆరోగ్యానికి హానికరం. అలా కాకుండా ఈ సహజ చిట్కాలు పాటించి దోమలకు చెక్ పెట్టండి. 

-3 టేబుల్ స్పూన్ల ఎప్సమ్ సాల్ట్ ను ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో వేసుకుని స్నానం చేయాలి. దోమ కాటు నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు. 

-కొందరిని దోమలు ఎక్కువగా  కుడుతుంటాయి. మీరు కూడా బాధితులు అయితే..వేపనూనెకు రెండు చుక్కల కొబ్బరినూనె కలిపి ఒంటికి రాసుకోవాలి. కనీస 8గంటల పాటు దోమలు మీ దగ్గరికి రావు 

-యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉండే వేప క్రిమికీటకాలనే కాదు..దోమలనూ అరికడుతుంది. కాస్త కర్పూరం, వేప ఆకులు కలిపి పొడి చేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పొగవేయండి. ఈ వాసనకు దోమలు దూరం అవుతాయి. 

-సాయంత్రం కాస్త సాంబ్రాణి తీసుకుని పొగ వేసి తలుపులు మూసేయాలి. ఇది దోమలనుఇంట్లోకి దూరనీయదు. 

-కప్పు నీళ్లలో యూకలిప్టస్ ఆయిల్ రెండు చుక్కలు కలిపి ఇల్లంతా స్ప్రే చేయాలి. ఆ ఘాటైన పరిమళం దెబ్బకు దోమలు పారిపోతాయి. 

-నాలుగు వెల్లుల్లిపాయలను దంచి దానికి కాస్త కర్పూరం, కొద్దిగా ఏదైనా నూనె చేర్చి..వెలిగించాలి. మీ సమస్య దూరం అవుతుంది. 

సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్