స్త్రీల మాదిరిగానే, పురుషులు కూడా అందంగా కనిపించాలని కోరుకుంటారు. అయితే కొన్ని చిట్కాలు ఫాలో అయితే మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. ఆ చిట్కాలేంటో చూద్దామా?
ప్రతీకాత్మక చిత్రం
men skin care tips : అందంగా కనిపించాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా ఆడవారు అందానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలని..మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్టులను వాడుతుంటారు. అయితే అబ్బాయిల్లో కూడా అందంగా కనిపించాలని కోరుకునేవారు చాలా మందే ఉంటారు. వారు కూడా రకరకల ప్రొడెక్టులను వాడుతుంటారు. అయితే అమ్మాయిల వలే అబ్బాయిల ముఖం మెరిసిపోవాలంటే కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే. అవేంటో చూద్దాం.
ముందుగా వైద్యుని సలహా:
మీ చర్మం మెరిసిపోవాలంటే మార్కెట్లో దొరికే ఉత్పత్తులన్నీ వాడకూడదు. ముందుగా వైద్యులను సంప్రదించాలి. సూర్యరశ్మి, మొటిమలు, మచ్చలు, దుమ్ము ఇతర కాలుష్య కారకాల నుంచి చర్మాన్ని రక్షించుకునేందుకు రోజువారీ దినచర్యను అనుసరించాలని వైద్యులు సలహా ఇస్తుంటారు. వైద్యులు చెప్పిన సలహాలు పాటించడం వల్ల మీ చర్మంగా ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది.
పరిశుభ్రత :
అమ్మాయిలో కాదు అబ్బాయిలు కూడా రోజులో రెండు మూడు సార్లు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. మీ చర్మ రకానికి సరిపోయే ప్రత్యేకంగా రూపొందించిన ఉత్పత్తులను ఉపయోగించి మీ ముఖాన్ని రోజుకు రెండుసార్లు కడగాలి. ఇది ముఖంలోని జిడ్డును తొలగించి.. మీ ముఖానికి సహజమైన కాంతిని అందించడానికి డెడ్ స్కిన్ సెల్స్‌ను ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది.
సూర్య రక్షణ :
సూర్యరశ్మికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. ఎండలో బయటకు వెళ్లినప్పుడు సూర్యుని అతినీలలోహిత కిరణాలు,కాలుష్యం వల్ల చర్మం పాడైతుంది. లోపల లేదా వెలుపల మంచి సన్‌బ్లాక్ ధరించడం చాలా అవసరం. ఇది మీ ముఖాన్ని మచ్చలు, పిగ్మెంటేషన్ ముడతలు, వృద్ధాప్యం, చర్మ క్యాన్సర్ వంటి ఇతర సంకేతాల నుండి కాపాడుతుంది.
మాయిశ్చరైజర్ వాడకం:
చర్మ సంరక్షణలో మాయిశ్చరైజింగ్ ఒక ముఖ్యమైన దశ. ప్రతి చర్మ రకానికి తేమను, పోషణను అందించడానికి మాయిశ్చరైజర్ అవసరం. ఇది మీ సహజ తేమ స్థాయిని కాపాడుతుంది.కాబట్టి మీ చర్మం రకాన్ని తెలుసుకుని..దానికి సరిపోయే మాయిశ్చరైజర్ ఎంపిక చేసుకోవాలి. మీ ముఖం జిడ్డుగా ఉంటే, మీరు జెల్ లేదా మాట్ ఉపయోగించవచ్చు.
మనలో చాలా మంది మన చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఇష్టపడరు.చర్మ సౌందర్యానికి ఉపయోగపడే ప్రొడక్టులు ఖరీదైనవిగా భావిస్తుంటారు.కానీ మీరు అనవసరమైన వస్తువులపై దాని కంటే ఎక్కువ ఖర్చు చేయడం మానేసి, మీకు ఉపయోగపడే ఈ ఉత్పత్తులను కొనుగోలు చేస్తే, మీరు మీ చర్మాన్ని కాపాడుకోవచ్చు. అమ్మాయిల వలే అబ్బాయిలు కూడా సున్నిత చర్మం కలిగి ఉంటారు. ఈ చిట్కాలు ఫాలో అయితే మీ ముఖం కూడా మెరిసిపోతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.