Bird Flu chicken | చికెన్ తినాలంటే ఈ పద్ధతి ఫాలో అవ్వాలంటున్న వైద్య నిపుణులు

బర్డ్ ఫ్లూ టైంలో కూడా చికెన్ తినాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

bird flu

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్, ఈవార్తలు : ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. బర్డ్ ఫ్లూ పట్ల జాగ్రత్తగా ఉండాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాయి. దీంతో ప్రజలు చికెన్ తినాలంటే భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో బర్డ్ ఫ్లూ టైంలో కూడా చికెన్ తినాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ‘బర్డ్ ఫ్లూ వైరస్ అధిక ఉష్ణోగ్రత వద్ద బతకదు. చికెన్, కోడిగుడ్లను బాగా ఉడకబెట్టాలి. ఇలా చేసి తింటే బర్డ్ ఫ్లూ ప్రమాదమే లేదు. చికెన్‌ను 75 డిగ్రీల సెల్సియస్‌ డిగ్రీలపై ఉష్ణోగ్రత వద్ద బాగా ఉడికించి తినాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి’ అని సూచించారు. అయితే, చికెన్ చెడు వాసన వస్తుంటే తినకపోవడమే బెటర్ అని తెలిపారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బర్డ్ ఫ్లూ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. బర్డ్ ఫ్లూ కోళ్ల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉన్నందున గ్రిల్డ్ చికెన్‌తో పాటు సరిగా ఉడకని చికెన్ తినవద్దని హెచ్చరిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్