బీపీని తగ్గించడానికి 5 నేచురల్ టిప్స్

ప్రస్తుతం ఇప్పుడు ఉన్న కాలంలో యువత నుండి పండు ముసలి వాళ్ల వరకు కూడా బీపీ, షుగర్ లాంటివి అధికంగా వస్తున్నా్యి. దానికి కారణం మనం రోజు తీసుకునే ఆహారం, జీవన శైలి, మానసిక ఒత్తిడికి గురికావడం. బీపీ, షుగర్ నుండి ఉపశమనం పొందడానికి ఏం చేయాలంటే..

blood pressure
ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం ఇప్పుడు ఉన్న కాలంలో యువత నుండి పండు ముసలి వాళ్ల వరకు కూడా బీపీ, షుగర్ లాంటివి అధికంగా వస్తున్నా్యి.  దానికి కారణం మనం రోజు తీసుకునే ఆహారం, జీవన శైలి, మానసిక ఒత్తిడికి గురికావడం. బీపీ, షుగర్ నుండి ఉపశమనం పొందడానికి ఏం చేయాలంటే..

1. బరువు తగ్గడం: బీపీ రావటానికి బరువు కూడా ఒక కారణం అవుతుంది. అందువలన బరువును కంట్రోల్ లో పెట్టుకోవడం మంచిది.

2. రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం: వ్యాయామం చేయడం వల్ల రక్తనాళ్లలో ఉన్నా ఎండోథీలియం పొర ఆరోగ్యం మెరుగవుతుంది కాబట్టి బీపీ నెమ్మదిగా తగ్గిపోతుంది.

3.ఉప్పు తక్కువగా తీసుకోవడం: ఆహారంలో చాలా వరకు కూడా ఉప్పు తక్కువగా తీసుకోవడం వలన బీపీని కంట్రోల్‌లో పెట్టవచ్చు. ఎందుకంటే ఉప్పులో సోడియం ఎక్కువగా ఉంటుంది. సోడియం ఎక్కువగా  ఉంటే బీపీ పెరుగుతుంది కదా అప్పడాలు వడియాలు నిల్వ పచ్చడిలో సోడియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటికి వీలైనంత వరకు దూరంగా పెట్టడం మంచిది.  ఒక్క రోజుల్లో 5గ్రాముల కంటే ఒక టీ స్పూన్ మాత్రమే ఉప్పు తీసుకోవాలి.

4. పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం: పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే బీపీ తగ్గిపోతుంది. దీనిని డాష్ డైట్ అంటాము, అంటే డైట్రీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్ ఆకుకూరలు కూరగాయల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. బనానా, బీట్రూట్‌లో కూడా పొటాషియం ఎక్కువగా ఉంటుంది.

5. ఒత్తిడిని తగ్గించుకోవడం: ఒత్తిడిని తగ్గించుకొని 6 నుండి 8 గంటలు పడుకోవడం.

ఈ ఐదు చిట్కాల ద్వారా బీపీని కంట్రోల్‌లో పెట్టడం సాధ్యమవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్