సాధారణంగా లావుగా ఉన్నవారి ముఖాలు కూడా కొద్దిగా లావుగా కనిపిస్తాయి. దీనికి కారణం.. శరీరంలోని ఇతర భాగాల్లో కొవ్వు పేరుకుపోవడంతో.. ముఖంపై కూడా కొవ్వు పెరుగుతుంది. అయితే కొంతమంది సన్నగా ఉన్నప్పటికీ ముఖంపై లావుగా ఉంటుంది.
ముఖంపై కొవ్వు
సాధారణంగా లావుగా ఉన్నవారి ముఖాలు కూడా కొద్దిగా లావుగా కనిపిస్తాయి. దీనికి కారణం.. శరీరంలోని ఇతర భాగాల్లో కొవ్వు పేరుకుపోవడంతో.. ముఖంపై కూడా కొవ్వు పెరుగుతుంది. అయితే కొంతమంది సన్నగా ఉన్నప్పటికీ ముఖంపై లావుగా ఉంటుంది. దీంతో వారు అందవిహీనంగా కనిపిస్తారు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే ముఖంపై కొవ్వును చాలా తేలికగా తగ్గించుకోవచ్చు అంటున్నారు వైద్యులు. ఆ చిట్కాలు ఏంటో ఇక్కడ చూడండి.
ముఖ వ్యాయామాలు: ముఖ కొవ్వుతో బాధపడేవారు రక్త ప్రసరణను మెరుగుపరచడానికి ముఖ వ్యాయామాలు చేయవచ్చు. అలాగే ముఖ కండరాలు బలపడతాయి. ముఖంపై ఉన్న కొవ్వు కరిగిపోతుందని నిపుణులు అంటున్నారు. అందుకే ప్రతిరోజూ కొన్ని ముఖ వ్యాయామాలు సిఫార్సు చేస్తారు.
బరువు తగ్గడం: అధిక బరువు వల్ల ముఖంతో సహా శరీరంలోని అన్ని భాగాలలో కొవ్వు పేరుకుపోతుంది. కాబట్టి బరువు తగ్గాలంటే రోజూ చెమట పట్టేలా నడక, పరుగు, సైకిల్ తొక్కడం వంటి వ్యాయామాలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. 2014లో 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబేసిటీ'లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో ఏరోబిక్ వ్యాయామం (రన్నింగ్, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్) చేయడం వల్ల ముఖ కొవ్వు తగ్గుతుందని తేలింది. కొరియాలోని సియోల్ నేషనల్ యూనివర్శిటీ బుండాంగ్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ యూన్ JH. (జి హ్యూన్ యూన్) ఈ పరిశోధనలో పాల్గొన్నారు.
ఫేషియల్ మసాజ్: మసాజ్ ముఖంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చర్మానికి రక్తాన్ని అందించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, క్రమం తప్పకుండా ఫేస్ మసాజ్ చేయండి.
పుష్కలంగా నీరు త్రాగాలి: నీరు ఎక్కువగా తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది జంక్ ఫుడ్ తీసుకోవడం కూడా తగ్గించవచ్చు. అలాగే, తగినంత నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. ఇలా చేయడం వల్ల ముఖం అందంగా కనబడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఉప్పు తగ్గించండి: కొందరు ఆహారంలో ఉప్పును ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఊబకాయంతో బాధపడేవారు ఆహారంలో ఉప్పు తీసుకోవడం తగ్గించుకోవాలి. అలాగే ఉప్పు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్ , ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
బాగా నిద్రపోండి: ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోవడం వల్ల చాలా మందికి నిద్ర సరిగా పట్టడం లేదు. అర్ధరాత్రి వరకు ఫోన్‌లోనే చూస్తున్నారు. దీనివల్ల రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల ముఖంలో కొవ్వు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని తగ్గించుకోవాలంటే కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాలను అనుసరించండి కొన్ని రోజుల్లో ముఖం కొవ్వును తగ్గించడం ద్వారా మీరు అందంగా కనిపిస్తారు.