Money Management : పిల్లలకు స్మార్ట్‌గా ఆర్థిక జ్ఞానం నేర్పించే చిట్కాలు

Money Management : పిల్లలకు స్కూల్లో టీచర్లు అన్ని పాఠ్యాంశాలను చెప్పినప్పటికీ, ఆర్థిక జ్ఞానం గురించి చెప్పరు. తల్లిదండ్రులే పిల్లలకు వారి జీవితంలో ఎంతో అవసరమైన మనీ మేనేజ్‌మెంట్ గురించి తెలియజేయాలి.

financial lessons for kids

ప్రతీకాత్మక చిత్రం

Money Management : పిల్లలకు స్కూల్లో టీచర్లు అన్ని పాఠ్యాంశాలను చెప్పినప్పటికీ, ఆర్థిక జ్ఞానం గురించి చెప్పరు. తల్లిదండ్రులే పిల్లలకు వారి జీవితంలో ఎంతో అవసరమైన మనీ మేనేజ్‌మెంట్ గురించి తెలియజేయాలి. పిల్లల భవిష్యత్తు సురక్షితం కావాలంటే చిన్ననాటి నుంచే ఆర్థిక విషయాలను నేర్పించడం మంచిది. సులభమైన విధానంలో, వారి రోజువారీ ఉదాహరణలతో పిల్లలకు అవగాహన పెంచండి. ఇలా చెప్పడం వల్ల పిల్లలు తమ పొదుపు, ఖర్చులను నిర్వహించడం నేర్చుకుంటారు.

ఖర్చులు & పొదుపు పాఠాలు

పిల్లలకు డబ్బు విలువ చిన్నప్పటి నుంచే చెప్పాలి. పిల్లలు చాక్లెట్స్, బిస్కెట్స్, వస్తువులు అడిగినప్పుడు కొంతమంది తల్లిదండ్రులు చిన్న పిల్లలు కదా భావించి అడిగిన ప్రతిదీ కొనిస్తూ ఉంటారు. అయితే ఈ పద్ధతి వల్ల పిల్లలు భవిష్యత్తులో విచ్చలవిడితనం అలవాటు చేసుకొనే ప్రమాదం ఉంది. దీని వల్ల డబ్బు, శ్రమ విలువ తెలియదు. పిల్లలకు డబ్బు విలువ తెలియజేయడానికి ఇచ్చిన ప్రతి రూపాయి లెక్కను బుక్‌లో రాయాలని చెప్పండి. నెలాఖరులో లెక్కలు వేసి చెప్పాలని చెప్పండి. దీనివల్ల పిల్లలు కూడికలు, తీసివేతలు అలవాటు పడతారు. ఖర్చుల గురించి కూడా అవగాహన వస్తుంది.

పిల్లలు సాధారణంగా రిమోట్ కారు, జెసిబి, సైకిల్ కొనివ్వాలని అడుగుతారు. వెంటనే కొనివ్వకుండా తల్లిదండ్రులు పిల్లలకు మొదటగా కొనిపించాల్సింది "కిడ్డీ బ్యాంక్". వాళ్లు అడిగిన దానికి డబ్బు నేరుగా ఇవ్వకుండా, స్వంతంగా కొనుగోలు చేయగలిగే విధంగా ప్లాన్ చేయండి. ఇంట్లో చిన్న చిన్న పనులకు వారిని సహాయం చేయాలని చెప్పండి. దానికి బదులుగా డబ్బు ఇస్తామని చెప్పండి. పని పూర్తిచేసిన తర్వాత డబ్బులు ఇచ్చి కిడ్డీ బ్యాంక్‌లో దాచుకోవాలని చెప్పండి. కొన్ని రోజుల తర్వాత దాచుకున్న మొత్తం డబ్బుతో వారు అడిగింది కొనివ్వండి. దీనివల్ల కష్టపడితేనే డబ్బు వస్తుందని, అవసరమైన వస్తువులు కొంటారని తెలుస్తుంది.

బ్యాంక్ & డిజిటల్ వ్యాలెట్లు

మీరు బ్యాంక్ పని మీద వెళ్లినప్పుడు మీ పిల్లలను తీసుకెళ్లండి. డిపాజిట్, విత్‌డ్రా ఎలా చేయాలో, ఫారంలను ఎలా నింపాలో తెలియజేయండి. మీ ఫోన్‌లో గూగుల్ పే, ఇతర డిజిటల్ వ్యాలెట్ల ద్వారా కరెంట్ బిల్లు, నెట్ బిల్లు, మోటార్ బిల్లు ఎలా చెల్లించాలో వారికి చూపండి. వారితోనే బిల్లులు చెల్లించండి. ఇలా చేయడం వల్ల నెలనెలా ఖర్చు ఎలా ఉంటుందో అవగాహన పెరుగుతుంది, బ్యాంక్, డిజిటల్ వ్యాలెట్ల గురించి అవగాహన పెరుగుతుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్