దేశంలో ఊబకాయం బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గణనీయంగా పెరుగుతున్న ఊబకాయ బాధితుల సమస్యను ప్రజలకు తెలియజేయడం ద్వారా అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రెండు రోజుల కిందట నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఊబకాయం సమస్యపై మాట్లాడారు. ఈ సమస్య దేశంలో పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణను ఆయన తాజాగా రూపొందించారు. ఇందులో భాగంగానే ఊబకాయంపై యుద్ధం చేసేందుకు సహాయపడటానికి, విస్తృతస్థాయిలో ప్రచారాన్ని నిర్వహించేందుకు వివిధ రంగాలకు చెందిన పదిమంది ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం నియమించింది.
ప్రతీకాత్మక చిత్రం
దేశంలో ఊబకాయం బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గణనీయంగా పెరుగుతున్న ఊబకాయ బాధితుల సమస్యను ప్రజలకు తెలియజేయడం ద్వారా అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రెండు రోజుల కిందట నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఊబకాయం సమస్యపై మాట్లాడారు. ఈ సమస్య దేశంలో పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణను ఆయన తాజాగా రూపొందించారు. ఇందులో భాగంగానే ఊబకాయంపై యుద్ధం చేసేందుకు సహాయపడటానికి, విస్తృతస్థాయిలో ప్రచారాన్ని నిర్వహించేందుకు వివిధ రంగాలకు చెందిన పదిమంది ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం నియమించింది. వీరు ఊబకాయం సమస్యపై దేశవ్యాప్తంగా ప్రచారాన్ని నిర్వహించి ప్రజల్లో అవగాహనను కలిగించనున్నారు. నామినేట్ చేసిన ఈ పది మందిలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా, పారిశ్రామికవేత్త ఆనంద మహేంద్ర, నటులు మోహన్ లాల్, ఆర్ మాధవన్, గాయని శ్రేయ గోషాల్, భోజ్పురి గాయకుడు, నటుడు నిరాహువ, షూటింగ్ ఛాంపియన్ మనోభాకర్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, ఎంపీ సుధా మూర్తి ఉన్నారు. ఈ ప్రకటనపై వారంతా వెంటనే స్పందించారు. తమను నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఊబకాయంపై మరింత ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తమ తరఫున వారు కూడా పదిమంది చొప్పున నామినేట్ చేశారు. ప్రచారానికి కొనసాగింపుగా తామ ప్రతిపాదించిన ఆ పదిమంది మరో 10 మందిని నామినేట్ చేయాలని కోరారు.
ఊబకాయంతో పెను ప్రమాదం..
ఊబకాయంతో ఆరోగ్యానికి ప్రమాదమని డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికే పేర్కొంది. బాడీ మాస్ ఇండెక్స్ 25 కంటే ఎక్కువ ఉంటే దానిని అధిక బరువుగాను, 30 కంటే ఎక్కువ ఉంటే దానిని ఊబకాయంగాను పరిగణిస్తారు. భారతదేశంలో ఓబకాయానికి సంబంధించి ప్రమాదగంటికలు మోగుతున్నాయని గతేడాది లాన్సెట్ జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనం వెల్లడించింది. యువతలో ఎక్కువగా ఓబకాయం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే అసాంక్రమిక వ్యాధులైన గుండె జబ్బులు, స్ట్రోక్స్, మధుమేహంతో భారతీయులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఓబకాయం కూడా ఉంటే ఆ జబ్బులు తీవ్రత యువతలో మరింత పెరుగుతోంది. యొక్క వయసులోనే టైప్-2 మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దేశంలో ఇప్పటికే 10 కోట్ల మంది ఓబకాయంతో బాధపడుతున్నారు. కొన్ని రకాల క్యాన్సర్లు అరెస్టు కూడా ఊబకాయంతో పెరుగుతోంది. గుండెలో మంట, గాల్ బ్లాడర్ వ్యాధులు, లివర్ సమస్యలు తలెత్తుతున్నాయి. నిద్రలో కొంచెం సేపు ఊపిరి ఆగిపోయి మళ్లీ మొదలయ్యే స్లీప్ ఆత్మీయ ప్రమాదం ఊబకాయుల్లో చాలా ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యాయం వెల్లడించింది.
ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు..
దేశంలో ఊబకాయానికి సంబంధించిన గణాంకాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. 2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 24 శాతం మంది మహిళలు, 22.9 శాతం మంది పురుషులు ఊబకాయులుగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఊబకాయులు ఎక్కువగా ఉన్న దేశాల్లో అమెరికా, చైనా తరువాత భారత్ మూడో స్థానంలో ఉంది. 2035 నాటికి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 330 కోట్ల మంది ఊబకాయ బాధితులు ఉంటారని అంచనా. వీరిలో 77 కోట్ల మంది ఐదు నుంచి 19 ఏళ్ల మధ్య వారే ఉంటారు. గడిచిన ఏడాది లాన్సెట్ జర్నల్ అధ్యయనంలో పేర్కొన్న ప్రకారం 2022 నాటికి భారతదేశంలో 1.25 కోట్ల మంది ఐదు నుంచి 19 వేల మధ్య బాలలు అధిక బరువుతో ఉన్నారు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఊబకాయ బాధిత పిల్లల్లోని ప్రతి పదిమందిలో ఒకరు భారత దేశంలో ఉంటారని యూనిసెఫ్ ఒబేసిటీ అట్లాస్-22 పేర్కొంది. ఆ సమయానికి భారతదేశంలో 2.7 కోట్ల మందికి మించి ఊబకాయ పిల్లలు ఉంటారని అంచనా వేసింది.