ప్రపంచ వ్యాప్తంగా బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందన్న హెచ్చరికలను పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2020 నాటికి 10 మిలియన్ల మంది బ్రెయిన్ స్ట్రోక్ బారినపడి మృతి చెందుతారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) సహకారంతో లాన్సెట్ మెడికల్ జర్నల్ అధ్యయనం ఇదే విషయాన్ని వెల్లడించింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రపంచ వ్యాప్తంగా బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందన్న హెచ్చరికలను పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2020 నాటికి 10 మిలియన్ల మంది బ్రెయిన్ స్ట్రోక్ బారినపడి మృతి చెందుతారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) సహకారంతో లాన్సెట్ మెడికల్ జర్నల్ అధ్యయనం ఇదే విషయాన్ని వెల్లడించింది. 2050 నాటికి 9.7 మిలియన్లకు బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుందని ఈ అధ్యాయం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో బ్రెయిన్ స్ట్రోక్ పై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని వివరించింది. బ్రెయిన్ స్ట్రోక్ కు అధిక రక్తపోటు, మధుమేహం, ధూమపానం, జీవన విధానంలో వచ్చిన మార్పులు వంటి అంశాలు ప్రమాద కారకాలుగా మారి స్ట్రోక్ బారిన పడేలా చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మెదడులోని భాగాలకు రక్త ప్రసరణకు అంతరాయం కలిగినప్పుడు సాధారణంగా స్ట్రోక్ వస్తుంది. ఇది ఎవరికైనా, ఎప్పుడైనా రావచ్చు. ఇది పెద్ద ఆరోగ్య సమస్యలతోపాటు మెదడుకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, మద్యపానం, అధిక కొలెస్ట్రాల్ వల్ల ఈ ప్రమాదం మరింత ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా ఈ స్ట్రోక్ బారిన పడకుండా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రమాదకరకాలుగా ఉన్న వాటిని నియంత్రించుకోవడం ద్వారా ఈ విపత్తు బారిన పడకుండా ఉండవచ్చు. ఎప్పటికప్పుడు రక్తపోటును పరీక్షించుకోవాలి. బీపీ పెరగకుండా నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. నికోటిన్ వంటివి తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం వల్ల స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించవచ్చు. అదే సమయంలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఈ విపత్తు ప్రమాదం నుంచి ఎవరికి వారిని కాపాడుకునే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
గడచిన కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా స్ట్రోక్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ అధ్యయనాన్ని ఐసిఎంఆర్ చేపట్టింది. స్ట్రోక్ బారిన పడడానికి వయసుతో సంబంధం లేదని, స్ట్రోక్ బారిన పడేందుకు కారకాలుగా ఉన్న వాటిని నియంత్రించుకోవడం ద్వారా దీనికి చెప్పవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో చిన్న వయసు వారిలో కూడా స్ట్రోక్ సమస్య ఉత్పన్నమవుతోంది. దీనికి ఒబేసిటీ, శారీరక వ్యాయామం లేకపోవడం, అధిక బరువు వంటి అంశాలు కారణమవుతున్నాయి. తీవ్రమైన ఒత్తిడి వాళ్ల కూడా సాఫ్ట్వేర్ వంటి ఉద్యోగాలు చేసేవారిలో ఈ ఇబ్బంది పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.