కండోమ్.. ఈ మాట మాట్లడాలన్నా సరే చాలా మంది మొహమాటం పడిపోతుంటారు. ఈ టాపిక్‌పై డౌట్స్ ఉన్నా ఎవరినీ అడగలేని పరిస్థితి. మన ఇండియాలో రూ.2000-3000 వేల ఖరీదైన బట్టలు కొనటం సులభం.. కానీ రూ.25-30 పెట్టి కండోమ్ కొనడం ఇబ్బందిగా ఉంటుంది.
ప్రతీకాత్మక చిత్రం
కండోమ్.. ఈ మాట మాట్లడాలన్నా సరే చాలా మంది మొహమాటం పడిపోతుంటారు. ఈ టాపిక్‌పై డౌట్స్ ఉన్నా ఎవరినీ అడగలేని పరిస్థితి. మన ఇండియాలో రూ.2000-3000 వేల ఖరీదైన బట్టలు కొనటం సులభం.. కానీ రూ.25-30 పెట్టి కండోమ్ కొనడం ఇబ్బందిగా ఉంటుంది. 2020లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రిసెర్చ్ చేసింది. ఎంతమంది శృంగారంలో కండోమ్‌ని వాడుతున్నారని. అందులో 5 నుండి 6 శాతం మంది మాత్రమే అని రుజువైంది. ప్రెగ్నెన్సీ రాకుండా ఉండాలని చాలా మంది కండోమ్స్‌ను వాడుతుంటారు. అలాగే సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్, హెచ్‌ఐవీ, ఎయిడ్స్, క్లామిడియా, గొనోరియా, సిఫిలిల్స్ వంటి రాకుండా ఉండటానికి కూడా ఈ కండోమ్స్‌ను వాడుతారు. ఈ కండోమ్స్‌లో కూడా రెండు రకాలు ఉంటాయి. జెన్స్ కండోమ్స్ అని, ఫీమెల్ కండోమ్స్ అని రెండు రకాలు ఉంటాయి.
కండోమ్స్ మెటీరియల్.. లాటెక్స్, పాలియురితీన్, పాలిఐసోప్రిన్ ఉంటాయి. అందరికీ అందుబాటులో ఉండేవి మాత్రం లాటెక్స్ కండోమ్స్. కండోమ్స్ స్పెర్మ్, బ్యాక్టీరియా, వైరస్ వ్యాప్తి కాకుండా అడ్డుకొంటాయి. కొందరికి లాటెక్స్ కండోమ్‌తో ఎలర్జీ ఉంటుంది. అలాంటివారు పాలియురితిన్ కండోమ్స్, పాలిఐసోప్రిన్ కండోమ్స్ వాడటం బెటర్. చాలా మందిలో ఒక పెద్ద డౌట్ ఉండుంది కండోమ్ గురించి. అది ఏంటంటే కండోమ్ సైజ్. కండోమ్ పైన లార్జ్ అని, ఎక్స్‌ట్రా లార్జ్ అని ఉంటాయి, అందులో ఏది వాడాలి అని. లార్జ్ అని, ఎక్స్‌ట్రా లార్జ్ అని చెప్పేది.. కండోమ్ మందం గురించి మాత్రమే. కానీ.. సైజు గురించి కాదు. అందరికి ఒకటే సైజ్ కండోమ్ ఉంటుంది. అది వాడేప్పుడే పురుషాంగం సైజ్‌ను బట్టి ఆటోమెటిక్‌గా మారుతుంది. ఇక, కండోమ్స్‌లో చాలా రకాల డిజైన్స్ ఉంటాయి. అందులో ఏవి వాడాలి? అన్న సందేహం ఉంటుంది. ఎక్స్‌ట్రా తిన్, డాటెడ్ అని రకరకాలుగా దొరుకుతాయి. ఇందులో ఏది వాడితే కంఫర్ట్‌గా ఉంటుందో దాన్ని వాడటం మంచిది. అంతేకానీ దీన్ని మాత్రమే వాడాలి, దీన్ని మాత్రం వాడకూడదు అనేవి ఉండవు.