Liver Health | కాలేయాన్ని బాగుచేసే బ్యాక్టీరియా.. శాస్త్రవేత్తల అద్భుత పరిశోధన

evarthalu
ప్రతీకాత్మక చిత్రం


|| ప్రతీకాత్మక చిత్రం ||

ఈవార్తలు, హెల్త్ న్యూస్ : తిన్న అన్నం జీర్ణం చేసేది.. కాలేయం. శరీరానికి శక్తినిచ్చేది.. కాలేయం. శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపేది.. కాలేయం. అయితే, మనం తింటున్న ఆహారం ప్రమాదకరం కావటంతో కాలేయం చెడిపోతున్నది. చక్కెర, అధిక తీపి తినడం వల్ల కొవ్వు కాలేయం చుట్టూ చేరి దాన్ని పని చేయకుండా చేస్తుంది. దీంతో కొంతకాలానికి కాలేయం పనితీరు మందగించి చెడిపోతుంది. సాధారణంగా బ్యాక్టీరియాల్లో రెండు రకాలుంటాయి. కొన్ని హాని చేస్తే, కొన్ని శరీరానికి మంచి చేస్తాయి. అయితే, కాలేయాన్ని పాడు చేసే బ్యాక్టీరియానే దాన్ని మళ్లీ ఆరోగ్యంగా మార్చే బ్యాక్టీరియాను శాస్త్రవేత్తలు గుర్తించారు. లెప్రోసీ.. దీర్ఘకాలిక వ్యాధి. ఇది బ్యాక్టీరియం మైకోబ్యాక్టీరియం లెప్రీ వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియాకే మళ్లీ కాలేయాన్ని బాగు చేసి, ఆరోగ్యంగా చేయగల సత్తా ఉందని జంతువులపై చేసిన పరిశోధనలో గుర్తించారు.


సహజంగా జరిగే ఈ ప్రక్రియ వల్ల మనుషుల్లోనూ కాలేయాన్ని తిరిగి బాగు చేయవచ్చని, మనిషి ఆయుర్దాయాన్ని పెంచవచ్చని పరిశోధన చేపట్టిన ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. కాలేయ సంబంధ వ్యాధులతో బాధపడేవారిలో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయకుండానే, ఈ ప్రక్రియ ద్వారా కాలేయాన్ని తిరిగి ఆరోగ్యంగా మార్చవచ్చని వెల్లడించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్