కొన్ని రకాల ఫుడ్స్ తో క్యాన్సర్ బారినపడే ముప్పు ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఎలాంటి ఫుడ్స్ కు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతీకాత్మక చిత్రం
కొన్ని రకాల ఆహార పదార్ధాలతో క్యాన్సర్ బారినపడే అవకాశం తప్పదని హెచ్చరిస్తున్నాయి పలు అధ్యయనాలు. మనం ఆరోగ్యకరమైన ఫుడ్స్ తీసుకుంటూ క్యాన్సర్ ముప్పును పెంచే ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం వల్ల ప్రాణాంతక వ్యాధుల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో అధికంగా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, నట్స్ ఉండేవిధంగా చూసుకోవాలని సూచిస్తున్నారు.
ప్రాసెస్ చేసిన ఫుడ్స్, ఆల్కహాల్, గ్రిల్డ్ ఫుడ్ వంటి ఫుడ్స్ కుదూరంగా ఉండటం మేలంటున్నారు. ప్యాకేజ్డ్ ప్రాసెస్డ్ మీట్ ఎక్కువ కాలం స్టోర్ చేసేందుకు అధిక ఉప్పు వాడతారని వీటిని అధికంగా తీసుకున్నవారిలో కొలొరెక్టల్, బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు పొంచి ఉందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ఇక అధికంగా వేయించిన ఫుడ్స్ జోలికి వెళ్లకూడదని చెబుతున్నారు.
వీటి ద్వారా క్యాన్సర్ తోపాటు టైప్ 2 డయాబెటిస్, గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. షుగర్ ఎక్కువగా ఉంటే సోడాలు, వైట్ బ్రెడ్, వైట్ పాస్తా వంటి అధిక రిఫైన్డ్ ఫుడ్స్ తో క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల వద్ద గ్రిల్ చేసే మాంసం, ఇతర ఆహార పదార్థాలు క్యాన్సర్ ముప్పును పెంచుతాయంటున్నారు.