Turmeric Benefits: ఉదయాన్నే చిటికెడ్ పసుపును ఇలా తీసుకుంటే లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు

వంటగదిలో ఉండే పసుపులో లెక్కలేనని అద్భుత ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో చిటికెడు పసుపును తీసుకుంటే, అది బరువు తగ్గడం నుండి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు అనేక ప్రయోజనాలను పొందవచ్చు. పసుపు ఎలా తినాలో తెలుసుకుందాం.

turmeric

ప్రతీకాత్మక చిత్రం 

భారతీయుల వంటగదిలో పసుపు తప్పకుండా ఉంటుంది. పసుపులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఆయుర్వేదంలోనూ పసుపును ఉపయోగిస్తారు. పసుపు ఆహారానికి రంగు, రుచిని అందించడమే  కాకుండా పసుపు తినడం ద్వారా అనేక వ్యాధులు నయమవుతాయి. మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో చిటికెడు పసుపును తీసుకుంటే, ఇది స్థూలకాయాన్ని తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇవి మీ నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పసుపు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పసుపు అనేక జీర్ణసంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. ఒక విధంగా మసాలా దినుసులలో పసుపు ఆరోగ్యానికి నిధి అని చెప్పవచ్చు. ఉదయాన్నే పసుపు ఎలా తినాలో తెలుసుకుందాం. 

పసుపును ఉదయాన్నే ఎలా తీసుకోవాలి? 

ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో 1 గ్లాసు నీటిలో  పసుపు వేసి త్రాగడం ఉత్తమ మార్గం. ఇందుకోసం కావాలంటే చిటికెడు పసుపును రాత్రంతా నీళ్లలో వేసి వేడి చేసి ఉదయాన్నే తాగవచ్చు. లేదా ఉదయం నీళ్లు తాగేటప్పుడు అందులో చిటికెడు పసుపు వేసి వేడి చేసి ఈ నీటిని తాగాలి. నీళ్లు తాగేటప్పుడు మలసానా భంగిమలో కూర్చుంటే ఇంకా మంచిది. పసుపు నీళ్లను నోటిలో వేసుకుంటూ నెమ్మదిగా తాగాలి. దీని తర్వాత కొంత సమయం వరకు ఏమీ తినకూడదు.

ఖాళీ కడుపుతో పసుపు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు :

-ప్రతిరోజూ 1 చిటికెడు పసుపు మీ బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి, పసుపు నీటిని తాగవచ్చు.

-పసుపు నీరు త్రాగడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మీ పొట్టను పూర్తిగా శుభ్రపరుస్తుంది.

-పసుపులో ఉండే కర్కుమిన్ శరీరంలో మంటను తగ్గిస్తుంది. 

-పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి. ఫ్రీ రాడికల్స్, సెల్ డ్యామేజ్ నుండి చర్మాన్ని రక్షిస్తుంది.

-పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

-పసుపు తీసుకోవడం వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని కాపాడుతుంది.

-మీరు చిటికెడు పసుపును తింటే, అది నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

-పసుపు తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి గొప్ప ఉపశమనం లభిస్తుంది. దీంతో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్